News March 13, 2025
సంగారెడ్డి: ఫస్టియర్ పరీక్ష.. 97.42% హాజరు

సంగారెడ్డి జిల్లాలో 54 పరీక్ష కేంద్రాల్లో గురువారం జరిగిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం పరీక్షల్లో 96.81% విద్యార్థులు హాజరయ్యారని ఇంటర్మీడియట్ జిల్లా అధికారి గోవింద్ రాం తెలిపారు.16,290 మంది విద్యార్థులకు గాను 15,869 మంది విద్యార్థులు హాజరయ్యారని, 421 మంది విద్యార్థులు పరీక్షకు గైర్హాజరైనట్లు పేర్కొన్నారు.
Similar News
News February 9, 2026
రేపు స్పీకర్‌పై అవిశ్వాస అస్త్రం!

లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టేందుకు విపక్ష ఇండీ కూటమి సిద్ధమైంది. సభలో తమ గొంతు నొక్కేస్తున్నారని, స్పీకర్ నిష్పాక్షికంగా వ్యవహరించడం లేదని ఆరోపిస్తూ కాంగ్రెస్ సహా ప్రతిపక్ష MPలు ఈ నిర్ణయం తీసుకున్నారు. నరవణె పుస్తక ప్రస్తావన సమయంలో రాహుల్ గాంధీని అడ్డుకోవడం, ప్రధానిపై దాడికి ప్రయత్నిస్తున్నారంటూ మహిళా MPలపై నిరాధార ఆరోపణలు చేయడం ఈ వివాదానికి ఆజ్యం పోశాయి.
News February 9, 2026
నెల్లూరు: CIపై ఆరోపణలు.. కానిస్టేబుల్ సస్పెండ్

తనను ఉదయగిరి సీఐ N.వెంకట్రావు <<19088594>>వేధిస్తున్నారని <<>>సీతారామపురం మహిళా కానిస్టేబుల్ జ్యోతి ఆరోపించిన విషయం తెలిసిందే. ఆమెకు నెల్లూరు ఎస్పీ అజిత వేజెండ్ల షాక్ ఇచ్చారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించారని ఆమెను సస్పెండ్ చేశారు. ‘ఉన్నతాధికారి పర్మిషన్ లేకుండా ప్రెస్‌మీట్ నిర్వహించడం రూల్స్‌కు విరుద్ధం. సీఐపై నిరాధార ఆరోపణలు చేశారు. క్రమశిక్షణ చర్యల కింద ఆమెను సస్పెండ్ చేశాం’ అని SP పేర్కొన్నారు.
News February 9, 2026
CM సమీక్షకు అన్నమయ్య కలెక్టర్ హాజరు

అమరావతి నుంచి సీఎం చంద్రబాబు సోమవారం ఉదయం వర్చువల్ కాన్ఫెరెన్స్ నిర్వహించారు. రాష్ట్రంలోని మంత్రులు, హెచ్ఓడీలు, సెక్రెటరీలతో చర్చించారు. మదనపల్లెలోని కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తదితరులు సమీక్షకు హాజరయ్యారు. పలు అంశాలపై చర్చించారు.


