News January 10, 2026
సంగారెడ్డి: ఫిజికల్ ఫిట్నెస్ కాపాడుకోవాలి: ఎస్పీ

పోలీసులకు ఫిజికల్ ఫిట్నెస్ ఎంతో ముఖ్యమని, శారీరకంగా, మానసికంగా ఫిట్‌గా ఉండాలని ఎస్పీ పారితోష్ పంకజ్ సూచించారు. ఆర్ముడ్ రిజర్వ్ పోలీసులకు ఆర్ఐ రాజశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పోలీసు పరేడ్ గ్రౌండ్స్ శనివారం వీక్లీ పరేడ్ నిర్వహించారు. ఎలాంటి పరిస్థితుల్లోనైనా సమర్ధవంతంగా విధులను నిర్వహించాలన్నారు. ప్రతి రోజు యోగా, వ్యాయామం చేస్తూ ఫిజికల్ ఫిట్నెస్‌ను కాపాడుకోవాలన్నారు.
Similar News
News January 16, 2026
నిజామాబాద్: ఆపరేషన్ సింధూర్, పుష్ప పతంగుల జోరు

నిజామాబాద్ లో సంక్రాంతి సందర్భంగా ఆపరేషన్ సింధూర్, పుష్ప పతంగులు సందడి చేశాయి. ప్రత్యేకంగా ఈ కైట్లు ఎగురవేసేందుకు పిల్లలు యువత ఆసక్తి చూపించారు. ఎటు చూసినా ఆపరేషన్ సిందూర్ కైట్‌లే కనిపించాయి. మోదీ భద్రత దళాలతో ఉన్న ఫోటో కైట్ పై ఆకట్టుకుంటుంది. ఆపరేషన్ సిందూర్, పుష్ప రెండు ఎంత సక్సెస్ అయ్యాయో అందరికీ తెలుసు. ఇపుడు సంక్రాంతి కైట్‌లలో కూడా పాపులర్ అయ్యాయి.
News January 16, 2026
JGTL: సన్న వడ్లకు బోనస్ ఉత్తి మాటేనా…?

ప్రభుత్వం సన్న వడ్లకు ఇస్తానన్న రూ.500 బోనస్ ఉత్త మాటగా మిగిలింది. గత 3 సీజన్ల నుంచి బోనస్ ఇస్తామని ప్రభుత్వం దాటవేస్తూ వస్తుంది. జిల్లాలో గత సీజన్లో 428 కొనుగోలు కేంద్రాల ద్వారా సుమారు 6 లక్షల MTకి పైగా ధాన్యం కొనుగోలు చేయగా, ఇందులో సుమారు 70వేల క్వి. పైగా సన్నధాన్యం కొనుగోలు చేశారు. ఈ లెక్కన జిల్లా రైతులకు రూ.5కోట్లకు పైగా బోనస్ డబ్బులు రావాల్సి ఉన్న నేటికీ రూపాయి కూడా రాలేదు. వీటి ఊసే లేదు.