News January 31, 2025
సంగారెడ్డి: ఫిబ్రవరి 1 నుంచి పోలీస్ యాక్ట్

ఫిబ్రవరి 1 నుంచి 28 వరకు సంగారెడ్డి జిల్లాలో పోలీస్ చట్టం అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ రూపేష్ తెలిపారు. ముందస్తు అనుమతి లేకుండా ఎలాంటి ధర్నాలు, ర్యాలీలు, సభలు, సమావేశాలు, ఆందోళన కార్యక్రమాలను నిర్వహించకూడదని సూచించారు. అనుమతి లేకుండా ఎవరైనా కార్యక్రమాలు చేపడితే చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
Similar News
News November 21, 2025
బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణకు నిధి అగర్వాల్

బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్ కేసులో సీఐడీ విచారణ వేగవంతం చేసింది. మ.3గం.కు హీరోయిన్ నిధి అగర్వాల్, యాంకర్ శ్రీముఖి, అమృత చౌదరి సీఐడీ కార్యాలయానికి హాజరవుతున్నారు. ప్రమోషన్లకు సంబంధించిన వివరాలపై అధికారులు కీలకంగా ప్రశ్నించనున్నట్లు సమాచారం. ప్రమోషన్లు చేసిన తర్వాత ఎంత పారితోష్కం తీసుకున్నారన్న అంశాలపై సీఐడీ విచారణ జరుపుతోంది.
News November 21, 2025
90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో కిస్ సీన్!

ఇండియన్ సినిమాలో ముద్దు సీన్లు ఇప్పుడు కామన్. కానీ 90 ఏళ్ల క్రితమే మన సినిమాల్లో ముద్దు సీన్ స్టార్ట్ చేశారనే విషయం మీకు తెలుసా? 1933లో వచ్చిన ‘కర్మ’ చిత్రంలో నటీనటులు దేవికా రాణి, హిమాన్షు రాయ్ (నిజ జీవితంలో భార్యాభర్తలు) సుదీర్ఘమైన తొలి ముద్దు సీన్లో నటించారు. దాదాపు 4 నిమిషాల పాటు సాగిన ఈ ముద్దు సన్నివేశం అప్పట్లో దేశవ్యాప్తంగా పెద్ద సంచలనం సృష్టించిందని సినీవర్గాలు చెబుతున్నాయి.
News November 21, 2025
VJA: క్యాంపు కార్యాలయంలో మంత్రి రాంప్రసాద్ రెడ్డి ప్రజాదర్బార్

మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి విజయవాడ క్యాంపు కార్యాలయంలో శుక్రవారం ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజల నుంచి వచ్చిన వినతులను స్వయంగా స్వీకరించిన మంత్రి, సమస్యల పరిష్కారానికి సంబంధిత అధికారులకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజలకు అందుబాటులో ఉండడం, వారి సమస్యలను వేగంగా పరిష్కరించడం తమ ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని మంత్రి తెలిపారు.


