News March 26, 2024

సంగారెడ్డి: ఫేస్‌బుక్ పరిచయం.. రూ.8.57 లక్షలు కొట్టేసింది..!

image

సంగారెడ్డి జిల్లాలో సైబర్ మోసం వెలుగులోకి వచ్చింది. పటాన్‌చెరు పరిధి  బీరంగూడకు చెందిన ఓ ప్రైవేట్ ఉద్యోగికి ఫేస్‌బుక్‌లో ఓ అమ్మాయితో పరిచయం ఏర్పడింది. లండన్ నుంచి HYD వస్తున్నానని నమ్మించి పలు దఫాలుగా రూ.8.57 లక్షలు అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ చేయించుకుంది. అనంతరం రెస్పాన్స్ రాకపోవడంతో మోసపోయిన బాధితుడు సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నామన్నారు. 

Similar News

News February 17, 2025

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలి: డీఈవో

image

విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే విధంగా నూతన ఉపాధ్యాయులు కృషి చేయాలని జిల్లా విద్యాధికారి రాధా కిషన్ తెలిపారు. ఈ సందర్భంగా డీఈవో మాట్లాడుతూ.. జిల్లాలో 64 మంది నూతన ఉపాధ్యాయులు విధుల్లో చేరనున్నారని, దీంతో పాఠశాలలో ఉపాధ్యాయుల కొరత తీరనుందని తెలిపారు. నూతన ఉపాధ్యాయుల విధులలో చేరిన రిపోర్టును జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి పంపాలని సూచించారు.

News February 17, 2025

కొల్చారం: బైక్, ఆర్టీసీ బస్సు ఢీ.. యువకుడి మృతి

image

కొల్చారం శివారులో అదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతిచెందాడు. ఆర్టీసీ బస్సు, ద్విచక్ర వాహనం ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు తెలిపారు. దీంతో బైక్ పై ఉన్న కౌడిపల్లి మండలం కన్నారం గ్రామానికి చెందిన రాజేందర్(27) అక్కడికక్కడే మృతి చెందారు. మెదక్ నుంచి తన స్వగ్రామం కన్నారం వెళ్తుండగా ఈ ప్రమాదానికి గురయ్యాడు.

News February 16, 2025

శివంపేట: చోరీ కేసులో నలుగురు అరెస్టు

image

శివంపేట మండలం పెద్ద గొట్టిముక్కుల గ్రామ శివారులోని భవ్యస్ ఫార్మసిటికల్ కంపెనీలో ఈనెల 15న జరిగిన చోరీ కేసులో నలుగురు నిందితులను అరెస్టు చేసినట్టు పోలీసులు తెలిపారు. పరిశ్రమలో అర్ధరాత్రి వేళ ఇనుప సామాగ్రి చోరి చేయగా బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. గుమ్మడిదల గ్రామానికి చెందిన వెంకటేష్, ఆంజనేయులు, బ్రహ్మచారి, ధర్మేందర్లను అరెస్ట్ చేసి డిమాండ్‌కు తరలించారు.

error: Content is protected !!