News February 17, 2025
సంగారెడ్డి: బీమా డబ్బుల కోసం బావనే చంపేశాడు

బీమా డబ్బులకు ఆశపడి అక్క భర్తనే చంపేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్(42) పదేళ్ల క్రితం ఉపాధికోసం అమీన్‌పూర్‌కు వచ్చాడు. బామ్మర్ది నరేశ్ నాయక్‌తో కలిసి ఫైనాన్స్‌లో జేసీబీ కొనగా దానికి నెల క్రితం పోస్టల్ బీమా చేయించారు. కాగా బావ చనిపోతే బీమా డబ్బుతోపాటు లోన్ క్లియర్ అవుతుందని దురాశపడ్డ సురేశ్ ఈనెల 14న మేనమామ దేవీసింగ్‌తో కలిసి హత్య చేశారు.
Similar News
News October 26, 2025
భోజనం చేశాక ఈ శ్లోకం పఠిస్తే..?

రౌరవే పుణ్యనిలయే పద్మార్బుద నివాసినామ్ |
అర్థినాముదకం దత్తం అక్షయ్యముపతిష్ఠతు ||
భోజనం చేసిన తర్వాత ఈ శ్లోకం పఠిస్తే దానధర్మాలు చేసినంత పుణ్యం లభిస్తుందని పండితులు చెబుతున్నారు. మనం తినడానికి ముందు ఆకలి, దాహంతో ఉన్నవారిని గుర్తు చేసుకొని, కరుణతో కొన్ని మెతుకులు పక్కన పెట్టాలి. ఫలితంగా వారి ఆకలి తీరేలా సానుకూల శక్తులు తోడ్పడతాయని అంటున్నారు. వారి కోర్కెలు తీర్చిన పుణ్యం మనకు దక్కుతుందని నమ్మకం.
News October 26, 2025
కరీంనగర్లో ఇంటి ‘ఓనర్ల OVER ACTION’..!

కరీంనగర్లో ఓ ఇంటికి వేలాడదీసిన TO-LET బోర్డ్ చర్చకు దారితీసింది. పలు సామాజిక వర్గాల మనోభావాలు దెబ్బతీసేలా ఉన్న ఈ బోర్డుపై ఆయా సంఘాల నుంచి అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. విషయమేంటంటే.. కిసాన్ నగర్‌లోని కొందరు ఇంటి ఓనర్లు తమ ఇళ్లల్లో ఉన్న రూంలను అద్దెకు ఇచ్చేందుకు గేట్లకు టూ-లెట్ బోర్డులు పెట్టారు. అందులో కేవలం హిందువులకు మాత్రమే రూం రెంట్‌కి ఇస్తామని.. ముఖ్యంగా SC, ST వాళ్లకి NO-ENTRY అని రాశారు.
News October 26, 2025
అతివలకు తోడుగా ఈ టోల్‌ఫ్రీ నంబర్లు

బాలికలు, మహిళలపై జరుగుతున్న దాడులను అరికట్టి వారికి రక్షణ కల్పించేందుకు ప్రభుత్వాలు ప్రత్యేక టోల్‌ఫ్రీ నంబర్లు ఏర్పాటు చేశాయి. గృహహింస, లైంగిక వేధింపులు, ఆడపిల్లల అక్రమరవాణా నిరోధించేందుకు 181, బాల్యవివాహాలను నిరోధించేందుకు 1098, వేధింపుల నియంత్రణకు షీటీం, ప్రసూతి సేవలకు అంబులెన్స్ కోసం 102, అంగన్వాడీ హెల్ప్‌లైన్ కోసం 155209 నంబర్లను అత్యవసర సమయాల్లో సంప్రదించాలని నిపుణులు సూచిస్తున్నారు.


