News February 17, 2025

సంగారెడ్డి: బీమా డబ్బుల కోసం బావనే చంపేశాడు

image

బీమా డబ్బులకు ఆశపడి అక్క భర్తనే చంపేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్(42) పదేళ్ల క్రితం ఉపాధికోసం అమీన్‌పూర్‌కు వచ్చాడు. బామ్మర్ది నరేశ్ నాయక్‌తో కలిసి ఫైనాన్స్‌లో జేసీబీ కొనగా దానికి నెల క్రితం పోస్టల్ బీమా చేయించారు. కాగా బావ చనిపోతే బీమా డబ్బుతోపాటు లోన్ క్లియర్ అవుతుందని దురాశపడ్డ సురేశ్ ఈనెల 14న మేనమామ దేవీసింగ్‌తో కలిసి హత్య చేశారు.

Similar News

News April 15, 2026

1,250 మెకనైజడ్ బోట్లను ఇవ్వాలనుకున్నాం: YS జగన్

image

తాము జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్‌లో 1,250 మెకనైజడ్ బోట్లకు సదుపాయం కలిగేలా నిర్మాణం చేపట్టామని మాజీ CM జగన్ అన్నారు. ఆ బోట్లను కేవలం 10% మత్స్యకారులు కట్టుకుంటే, 40% రాయితీ ఇచ్చి, మిగిలిన దాన్ని లోన్ రూపంలో అందించే వాళ్లమన్నారు. అదే జరిగితే ఇప్పటికి 15 మంది మత్స్యకారులు ఆ బోట్లకు యజమానులై ఉండేవారన్నారు. కోల్డ్ స్టోరేజ్ యూనిట్లు, ఐస్ ప్లాంట్లు నడిచేవని, బోట్ల రిపేరు యూనిట్లు పనిచేసేవన్నారు.

News April 15, 2026

మూడు జిల్లాల్లో 4 వేలకు పైగా స్లాట్ బుకింగ్స్

image

మేడ్చల్, రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల్లో గత నాలుగు నెలల్లో రిజిస్ట్రేషన్ల కోసం 4 వేలకుపైగా స్లాట్ బుకింగ్స్ నమోదయ్యాయి. రియల్ ఎస్టేట్ లావాదేవీలు పెరగడం, ఆస్తుల కొనుగోలు విక్రయాలు అధికమవడం దీనికి కారణంగా అధికారులు తెలిపారు. ఆన్‌లైన్ స్లాట్ బుకింగ్ విధానం వల్ల పారదర్శకత పెరిగి, ప్రజలకు సులభంగా సేవలు అందుతున్నాయి. రాబోయే రోజుల్లో మరింత పెరుగుదల ఉండొచ్చని అంచనా వేశారు.

News April 15, 2026

శ్రీకాకుళం: కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో 87.82 శాతం ఉత్తీర్ణత

image

శ్రీకాకుళం జిల్లాలో 25 కేజీబీవీ జూనియర్ కళాశాలల్లో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం 772 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా 678 మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించినట్లు సమగ్ర శిక్ష జిల్లా ఏపీసీ పి.వేణుగోపాలరావు బుధవారం తెలిపారు. 87.82 శాతం ఉత్తీర్ణత సాధించినట్లు వెల్లడించారు. అత్యధికంగా 978 మార్కులు వచ్చాయని అన్నారు. నాలుగు కేజీబీవీలు శత శాతం ఫలితాలు సాధించాయని చెప్పారు.