News February 17, 2025
సంగారెడ్డి: బీమా డబ్బుల కోసం బావనే చంపేశాడు

బీమా డబ్బులకు ఆశపడి అక్క భర్తనే చంపేసిన ఘటన సంగారెడ్డి జిల్లాలో జరిగింది. పాపన్నపేట మండలం సోమ్లాతండాకు చెందిన బానోత్ గోపాల్ నాయక్(42) పదేళ్ల క్రితం ఉపాధికోసం అమీన్‌పూర్‌కు వచ్చాడు. బామ్మర్ది నరేశ్ నాయక్‌తో కలిసి ఫైనాన్స్‌లో జేసీబీ కొనగా దానికి నెల క్రితం పోస్టల్ బీమా చేయించారు. కాగా బావ చనిపోతే బీమా డబ్బుతోపాటు లోన్ క్లియర్ అవుతుందని దురాశపడ్డ సురేశ్ ఈనెల 14న మేనమామ దేవీసింగ్‌తో కలిసి హత్య చేశారు.
Similar News
News December 12, 2025
9 జిల్లాలతో విశాఖ ఎకనామిక్ రీజియన్

AP: VSP ఎకనామిక్ రీజియన్‌పై CM CBN సమీక్షించారు. శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి, పార్వతీపురం మన్యం, అనకాపల్లి, కాకినాడ, తూర్పుగోదావరి, అంబేడ్కర్ కోనసీమ జిల్లాలు దీని పరిధిలో ఉన్నాయి. APలో 31% విస్తీర్ణం, 23% జనాభాతో GDPలో 30% భాగస్వామ్యం VERదే. గ్లోబల్ పోర్ట్, నెక్ట్స్‌జెన్ ఐటీ, అగ్రికల్చర్, టూరిజం, హెల్త్ కేర్ వంటి 7 గ్రోత్ డ్రైవర్ల ద్వారా అభివృద్ధి చేయాలని లక్ష్యంగా నిర్ణయించారు.
News December 12, 2025
కాకినాడ: ‘ట్రామా కేర్ కేంద్రాల అభివృద్ధికి చర్యలు’

దేశవ్యాప్తంగా కేంద్రం ఏర్పాటు చేసిన ట్రామా కేర్ సెంటర్లు మరింత అభివృద్ధి చేస్తామని కేంద్ర ఆరోగ్య మంత్రి ప్రతాప్ రావు జాదవ్ తెలిపారు. పార్లమెంటులో శుక్రవారం కాకినాడ ఎంపీ ఉదయ శ్రీనివాస్ అడిగిన ప్రశ్నకు కేంద్ర మంత్రి లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు. గుజరాత్ తర్వాత ఏపీలోనే అత్యధికంగా 14 ట్రామా కేర్ సెంటర్లు ఏర్పాటు చేసినట్లు మంత్రి వివరించారని ఎంపీ తెలిపారు.
News December 12, 2025
మెదక్: రెండో విడత ఎన్నికలకు పటిష్ట బందోబస్తు: ఎస్పీ

రెండో విడత గ్రామపంచాయతీ ఎన్నికల కోసం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు పూర్తి చేసినట్లు మెదక్ ఎస్పీ డి.వి. శ్రీనివాస రావు తెలిపారు. డిసెంబర్ 12 సాయంత్రం 5 గంటల నుంచి పోలింగ్ ముగిసే వరకు సైలెంట్ పీరియడ్, 163 BNSS అమల్లో ఉంటాయని చెప్పారు. ర్యాలీలు, ప్రచారం, గుమిగూడడం పూర్తిగా నిషేధం. ఎన్నికలు శాంతియుతంగా జరుగేందుకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు.


