News March 19, 2025
సంగారెడ్డి: భట్టి బడ్జెట్లో వరాలు కురిపిస్తారా..!

నేడు అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్పై జిల్లా ప్రజలు బోలేడు ఆశలు పెట్టుకున్నారు. సంగారెడ్డి, జహీరాబాద్, ఖేడ్, ఆందోల్ నియోజకవర్గాలకు సాగునీరు అందించే సంగమేశ్వర, బసవేశ్వర ప్రాజెక్టులకు నిధుల కేటాయింపుపై ఆశలు పెట్టుకున్నారు. పటాన్చెరు రెవెన్యూ డివిజన్ ఏర్పాటులో జాప్యం, పెండింగ్లో ఉన్న కొత్త రోడ్లు, విద్యా, వైద్య రంగాల్లో అనిశ్చితి తొలిగేలా చేపట్టే కొత్త ప్రాజెక్టుల కోసం ఎదురుచూస్తున్నారు.
Similar News
News September 18, 2025
నాగార్జున యూనివర్సిటీలో ఫలితాలు విడుదల

ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం జూలై-2025లో నిర్వహించిన ఎంఎస్సీ II సెమిస్టర్ రెగ్యులర్ పరీక్షల ఫలితాలను అధికారి ఆలపాటి శివప్రసాదరావు విడుదల చేశారు. జియాలజీ, నానో బయోటెక్నాలజీ విభాగాల్లో 100% ఉత్తీర్ణత రాగా, మైక్రోబయాలజీ 98.59%, ఆక్వాకల్చర్ 95.45%, ఫుడ్ ప్రాసెసింగ్ 94.74% సాధించాయి. గణితశాస్త్రంలో తక్కువగా 59.17% మాత్రమే ఉత్తీర్ణత నమోదు అయింది. రీవాల్యూషన్ దరఖాస్తుల చివరి తేదీ సెప్టెంబర్ 26.
News September 18, 2025
కోచింగ్ లేకుండానే టీచర్ అయ్యాడు..!

SRపురం(M) కొత్తపల్లిమిట్టకి చెందిన ప్రభుకుమార్ టీచర్ ఉద్యోగం సాధించాడు. ఆర్థిక పరిస్థితులు బాగా లేకపోవడంతో ఎలాంటి కోచింగ్ తీసుకోలేదు. ఇంటి నుంచే ప్రిపేర్ అయ్యాడు. తండ్రి ఏసుపాదం రెండేళ్ల క్రితం చనిపోగా.. తల్లి మణియమ్మ రోజు కూలికి వెళ్లి ఇంటి బాగోగులు చూస్తున్నారు. ఉద్యోగం రావడంతో ఇక అమ్మను కూలి పనులకు పంపకుండా బాగా చూసుకుంటానని ప్రభు కుమార్ తెలిపాడు.
News September 18, 2025
HYD: క్షీణించిన అశోక్ ఆరోగ్యం.. ఆస్పత్రికి తరలింపు

HYDలో నిరుద్యోగ సమితి నాయకులు అశోక్ ఆమరణ నిరాహార దీక్ష 4 రోజులుగా చేస్తుండగా ఆరోగ్యంగా క్షీణించింది. దీంతో ఆయనను వనస్థలిపురం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లుగా బృందాలు తెలిపాయి. తెలంగాణ ప్రభుత్వం నిరుద్యోగులకు 2లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేసిందని, జాబ్ క్యాలెండర్ విడుదల చేసే వరకు తన ఆమరణ నిరాహార దీక్ష విరమించేది లేదని తేల్చి చెప్పారు.