News March 28, 2025
సంగారెడ్డి: భార్య సూసైడ్‌కు కారణమైన భర్తకు జైలు శిక్ష

ఆత్మహత్యకు ప్రేరేపించిన వ్యక్తికి ఐదు సంవత్సరాలు జైలు శిక్ష, వెయ్యి రూపాయల నిర్మాణ విధిస్తూ సీనియర్ సివిల్ జడ్జి డాక్టర్ ఎం రాధాకృష్ణ చౌహన్ గురువారం తీర్పు ఇచ్చారు. ఇస్మాయిల్‌కన్‌పేటకు చెందిన లక్ష్మయ్య మద్యానికి బానిసై భార్య యాదమ్మను వేధించేవాడు. మద్యం తాగి వచ్చి భార్యను వేధిడంతో 2019లో ఆత్మహత్య చేసుకుంది. ఈకేసులో నేరం నిరూపణ కావడంతో నిందితుడికి జైలు శిక్ష విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు.
Similar News
News April 3, 2025
వేసవి సెలవులు.. మీ పిల్లలు జాగ్రత్త: మెదక్ ఎస్పీ

మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే మీ జీవితంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని అన్నారు. వేసవి సెలవులు వస్తున్నాయని, మీ పిల్లలు బావులు, చెరువుల, వాగుల్లో ఈతకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
News April 3, 2025
గతేడాది మహబూబ్‌నగర్ FIRST.. ఈసారి వెనుకంజ..!

ఆస్తి పన్ను వసూళ్లను 100% అధిగమిస్తామని మహబూబ్‌నగర్ నగరపాలక సంస్థ అధికారులు తీవ్ర ప్రయత్నాలు చేశారు. ఎనిమిది బృందాలుగా ఏర్పడి.. ప్రతిరోజు ముమ్మరంగా వసూళ్లు చేపట్టారు. మార్చి నెలాఖరు నాటికి 100%వసూళ్లే టార్గెట్‌గా చేసిన ప్రయత్నాలు 47% శాతానికి పరిమితమై గ్రాఫ్ పూర్తిగా పడిపోయింది. గత ఏడాది రాష్ట్రంలో ఆస్తిపన్ను వసూళ్లలో నంబర్ వన్ స్థానంలో ఉన్న మహబూబ్‌నగర్ మున్సిపల్ శాఖ ఈసారి 50% కూడా చేయలేకపోయింది.
News April 3, 2025
నాగర్‌కర్నూల్: సాహితికి GOVT జాబ్.. సన్మానం

తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ నిర్వహించిన గ్రూప్-1 పరీక్షల్లో రాష్ట్ర స్థాయిలో 45వ ర్యాంకు సాధించిన ఉపాధ్యాయులు రాజ్యలత-వెంకటరమణ దంపతుల కూతురు డాక్టర్ సాహితిని PRTU TS నాగర్‌కర్నూల్ జిల్లా శాఖ ఆధ్వర్యంలో బుధవారం ఘనంగా సన్మానించారు. సాహితీ భవిష్యత్తులో ఉన్నత స్థాయికి ఎదగాలని, మంచి సామాజిక కార్యక్రమాలు చేపట్టాలని సూచించారు. జిల్లా బాధ్యులు, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పాల్గొన్నారు.