News January 26, 2025
సంగారెడ్డి: మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యటన

సంగారెడ్డి జిల్లా పుల్కల్ మండలం పరిధిలోని ఈసోజీపేట, పుల్కల్ గ్రామాల్లో ఆదివారం ప్రజా పాలన గ్రామసభలో రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ పార్టీ నాయకులు తెలిపారు. ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, కొత్త రేషన్ కార్డులు, ఇందిరమ్మ ఇళ్ల, రైతు భరోసా లబ్ధిదారులకు మంజూరు పత్రాలను అందజేయనున్నట్లు తెలిపారు.
Similar News
News November 4, 2025
కాజీపేట: ఏటీఎం కార్డు మార్చి.. నగదు కాజేసిన దుండగుడు..!

కాజీపేటలో ఏటీఎం మోసం ఘటన కలకలం రేపింది. రైల్వే ఉద్యోగి దావ కల్పన యూనియన్ బ్యాంకు ఏటీఎంలో రూ.46 వేల డిపాజిట్ చేస్తుండగా ఓ దుండగుడు సాయం చేస్తున్నట్లు నటించి ఆమె కార్డును మార్చి వేరే కార్డు ఇచ్చి వెళ్లిపోయాడు. ఇంటికి చేరిన కొద్దిసేపట్లోనే రూ.45 వేలు డ్రా అయినట్లు మెసేజీలు రావడంతో ఆమె షాక్‌కు గురై పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు సీసీ కెమెరా ఫుటేజీ ఆధారంగా నిందితుడి కోసం గాలిస్తున్నారు.
News November 4, 2025
చిత్తూరు విద్యార్థులకు అరుదైన అవకాశం

చిత్తూరులోని ఉన్నత పాఠశాలకు చెందిన 10వ తరగతి విద్యార్థులు N.లాస్య, M.రమాకాంత్‌కు అరుదైన అవకాశం దక్కింది. వీరిద్దరూ సైన్స్‌లో ప్రతిభ చూపడంతో “సైన్స్ ఎక్స్‌పోజర్ అండ్ ఎడ్యుకేషనల్ టూర్”కు సెలెక్ట్ చేశారు. ఇందులో భాగంగా నవంబర్ 6 నుంచి ఢిల్లీలో జరిగే వివిధ కార్యక్రమాల్లో పాల్గొంటారు. అక్కడి వివిధ కార్యాలయాలను చూపిస్తారు. పరిశోధనాసక్తి, దేశభక్తి పెంపొందించేలా టూర్ ఉంటుందని డీఈవో వరలక్ష్మి తెలిపారు.
News November 4, 2025
విజయవాడ: పలగాని నాగవైష్ణవి హత్య కేసు ఏమిటంటే?

విజయవాడకు చెందిన పలగాని ప్రభాకర్.. తొలుత మేనకోడల్ని పెళ్లి చేసుకోగా పిల్లలు పుట్టకపోవడంతో మరో మహిళను పెళ్లి చేసుకున్నారు. ఆమెకు వైష్ణవితో పాటు మరో ఇద్దరు పిల్లలు పుట్టారు. ప్రభాకర్ మొదటి భార్య తమ్ముడైన కృష్ణ.. ఆస్తి 2వ భార్యకు దక్కుతుందని భావించి <<18192610>>వైష్ణవిని.. శ్రీనివాస్, జగదీశ్ సాయంతో చంపారనేది అభియోగం.<<>> కాగా కుమార్తె మృతితో ప్రభాకర్ హఠాన్మరణం చెందగా కొన్నాళ్లకు తల్లి కూడా మరణించింది.


