News October 16, 2024

సంగారెడ్డి: మంత్రి దామోదర్ నేటి పర్యటన వివరాలు

image

రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ నేడు జిల్లాలో పర్యటిస్తారని కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో ట్రాఫిక్ పోలీసులకు బైకులను పంపిణీ చేస్తారన్నారు. 11 గంటలకు శివంపేటలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభిస్తారని పేర్కొన్నారు. నారాయణఖేడ్ నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులను ప్రారంభిస్తారని వివరించారు.

Similar News

News November 7, 2024

సంగారెడ్డి: ఉచిత శిక్షణకు దరఖాస్తుల ఆహ్వానం

image

బ్యూటీ పార్లర్ ఉచిత శిక్షణ కోసం సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు దరఖాస్తు చేసుకోవాలని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ బుధవారం తెలిపారు. 18 నుంచి 45 ఏళ్లలోపు మహిళలు అర్హులని చెప్పారు. బైపాస్ రహదారిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. ఈనెల 25 నుంచి శిక్షణ ప్రారంభమవుతుందని చెప్పారు.

News November 7, 2024

సర్వేకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలి: రాజనర్సింహ

image

ఇంటింటి సమగ్ర కుటుంబ సర్వేకు ఇండ్ల వద్దకు వచ్చే అధికారులకు ప్రజలు సహకరించాలని మంత్రి దామోదర రాజనర్సింహ పేర్కొన్నారు. ఆందోల్- జోగిపేట మున్సిపాలిటీ పరిది పోచమ్మగల్లి, ముదిరాజ్ గల్లిలో సర్వేను మంత్రి పరిశీలించారు. రాష్ట్ర ప్రభుత్వం సర్వేకు చాలా ప్రాధాన్యత ఇస్తుందని తెలిపారు. సర్వేలో సేకరించిన వివరాలను గోప్యంగా ఉంచడం జరుగుతుందని తెలిపారు.

News November 6, 2024

నర్సాపూర్: మహిళ ఉద్యోగినిపై కానిస్టేబుల్‌ వేధింపులు.. కేసు నమోదు

image

మెదక్ జిల్లాలో ఓ మహిళా ఉపాధ్యాయురాలిపై వేధింపులకు పాల్పడ్డ కానిస్టేబుల్‌పై కేసు నమోదైంది. నర్సాపూర్ పోలీసులు తెలిపిన వివరాలు.. మెదక్ సీసీఎస్‌లో విధులు నిర్వహిస్తున్న కానిస్టేబుల్ రాము కొంత కాలంగా ఓ ఉపాధ్యాయురాలిని లైంగికంగా వేధిస్తున్నాడు. నిన్న రాత్రి సైతం ఇంటికి వచ్చి ఇబ్బంది పెట్టారని ఆమె ఫిర్యాదు చేశారు. దీంతో రాముపై 354 సెక్షన్ కింద కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు.