News June 15, 2024
సంగారెడ్డి: మగ్గం వర్క్‌లో ఉచిత శిక్షణ
సంగారెడ్డిలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ గ్రామీణ సమయం ఉపాధి శిక్షణ కేంద్రంలో మగ్గం వర్క్ ఉచిత శిక్షణ కోసం అర్హులైన మహిళల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సంస్థ డైరెక్టర్ రాజేంద్రప్రసాద్ శుక్రవారం తెలిపారు. సంగారెడ్డి, మెదక్ జిల్లాలకు చెందిన గ్రామీణ ప్రాంత మహిళలు అర్హులని చెప్పారు. 18 నుంచి 45 సంవత్సరాల వరకు చిన్న మహిళలు సంగారెడ్డిలోని కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు.
Similar News
News September 10, 2024
MDK: టాస్కులు, కమీషన్ పేరుతో భారీ మోసం
సైబర్ మోసంలో టెకీ రూ.లక్షలు పోగొట్టుకున్న ఘనట అమీన్‌పూర్ PS పరిధిలో జరిగింది. పోలీసులు వివరాలు.. జన్మభూమి కాలనీ ఫేస్-2కు చెందిన సాఫ్ట్‌వేర్ ఉద్యోగికి టాస్కులు, కమీషన్ పేరుతో మెసేజ్ వచ్చింది. ఉద్యోగి తన వివరాలు నమోదు చేయగా టాస్కులు పూర్తి చేస్తే పెట్టిన నగదుతోపాటు కమీషన్ వస్తుందని నమ్మించారు. ఉద్యోగి పలు దఫాలుగా రూ.15.82లక్షలు వేశాడు. తాను పెట్టిన నగదుతో పాటు కమీషన్ ఇవ్వాలని అడుగగా స్పందించ లేదు.
News September 10, 2024
MDK: డెంగ్యూతో బాలుడు మృతి
డెంగ్యూతో బాధపడుతూ ఆస్పత్రిలో చేరిన బాలుడు చికిత్స పొందుతూ సోమవారం సాయంత్రం మృతి చెందాడు. హత్నూర మండలం కొన్యాల గ్రామానికి చెందిన ప్రభులింగం కుమరుడు దశ్విక్(45రోజులు) మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యాడు. దీంతో పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో అక్కడి నుంచి నీలోఫర్ ఆస్పత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ బాలుడు మృతి చెందాడు.
News September 10, 2024
MDKలో భారీగా తగ్గిన చికెన్ ధరలు
ఉమ్మడి మెదక్‌లో చికెన్ ధరలు భారీగా తగ్గాయి. గతవారం కిలో రూ. 200లకు పైగానే విక్రయించారు. గణేశ్ నవరాత్రులు మొదలుకావడంతో మాంసం విక్రయాలు క్రమంగా తగ్గినట్లు వ్యాపారులు చెబుతున్నారు. మంగళవారం చికెన్ ధరలు ఈ విధంగా ఉన్నాయి. విత్ స్కిన్ కిలో రూ. 161, స్కిన్ లెస్ రూ. 183, ఫాంరేటు రూ. 89, రిటైల్ రూ. 111 చొప్పున విక్రయిస్తున్నారు.
SHARE IT