News March 6, 2025
సంగారెడ్డి: మతిస్తిమితం లేని యువతిపై అత్యాచారం

మతిస్తిమితం సరిగ్గాలేని యువతిపై ఓ యువకుడు అత్యాచారానికి ఒడిగట్టిన ఘటన ఆందోల్ మండలంలో ఆలస్యంగా వెలుగు చూసింది. పోలీసుల వివరాలు.. ఓ గ్రామానికి చెందిన యువతి(24) చిన్ననాటి నుంచి మతిస్తిమితం లేక పోవడంతో కుటుంబీకులు ఆమెకు పెళ్లి చేయలేదు. యువతి ప్రతిరోజు గ్రామంలో అటు ఇటూ తిరిగి ఇంటికి చేరుకునేది. నాలుగు రోజుల క్రితం శంకర్ అనే యువకుడు మద్యం మత్తులో యువతిని పొలం వద్దకు తీసుకెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు.
Similar News
News November 22, 2025
కరీంనగర్: సర్వర్ డౌన్.. ‘సర్టిఫికేట్ల సేవలు బంద్’..!

కమిషనర్ అండ్ డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్(CDMA) సర్వర్ డౌన్తో రాష్ట్రంలో బర్త్, డెత్ సర్టిఫికెట్ల జారీకి తీవ్ర ఆటంకం ఎదురవుతోంది. దీంతో ఉమ్మడి KNR జిల్లాలో దరఖాస్తుదారులు ధ్రువీకరణ పత్రాల కోసం ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కాగా మున్సిపల్ కార్యాలయాలల్లో సర్టిఫికేట్ల నమోదు, జారీ ప్రక్రియ ఆగిపోయింది. సంబంధిత శాఖ ఉన్నతాధికారులు 4 రోజులుగా నెట్వర్క్ కంపెనీతో సంప్రదిస్తున్నా సమస్య అలానే ఉంది.
News November 22, 2025
వరంగల్: ‘సారథి’ సాగట్లే..!

సారథి పరివాహన్ వెబ్సైట్లో సాంకేతిక సమస్యలు పెరుగుతుండడంతో ఉమ్మడి వరంగల్ జిల్లాలో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. డ్రైవింగ్ లైసెన్స్ రెన్యూవల్, స్థాయి పెంపుదల, బ్యాడ్జ్ లైసెన్స్ అప్లికేషన్లకు డేటా కనిపించకపోవడం, రిజిస్ట్రేషన్ పూర్తి కాకపోవడం వంటి సమస్యలు వరుసగా వస్తున్నాయి. రెండు నెలలుగా వెబ్సైట్ నూతనీకరణ తర్వాత పరిస్థితి ఇంకా చక్కదిద్దకపోవడంతో దరఖాస్తుదారులు ఇబ్బంది పడుతున్నారు
News November 22, 2025
JGTL: రోడ్లపై ధాన్యం రాశులు వద్దు.. ఇలా చేస్తే ముద్దు..!

రోడ్లపై రైతులు పోస్తున్న ధాన్యంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయన్న దాన్ని గుర్తించిన JGTL VDC సభ్యులు ఇటీవల తమ ఆధ్వర్యంలో దుబ్బగట్టు ప్రాంతాన్ని చదును చేశారు. మల్లాపూర్(M) కేంద్రంలో రైతులు ధాన్యం పోసుకునేందుకు వీలుగా తీర్చిదిద్దారు. JCBలతో ఫ్లాట్ చేయించారు. వీరికి పార్టీల నేతల సహకారం అందింది. రైతులు తమ ధాన్యాన్ని రోడ్లపై పోయొద్దని ఈ సందర్భంగా వారు కోరారు. మిగతా ప్రాంతాల్లోనూ ఇలానే చేయాలని ఆకాంక్షించారు.


