News March 12, 2025
సంగారెడ్డి: మనం ప్రమాదకరమైన గాలిపీలుస్తున్నాం..!

కర్బన ఉద్గారాలతో గాలి నాణ్యత తగ్గి, భిన్న వాతావరణ పరిస్థితులతో ప్రజలు ఉక్కరిబిక్కిరి అవుతున్నారు. గాలి నాణ్యత విలువ 0-50 ఉంటే మంచిదని నిపుణులు చెబుతున్నారు. 51-100ఉంటే పర్వాలేదని, 101-150 ఉంటే పెద్దలూ, పిల్లల్లో ఊపిరితిత్తులు, ఇతర వ్యాధులు రావొచ్చని హెచ్చరిస్తున్నారు. 201-300 ఉంటే అందరికీ ప్రమాదముంది. సంగారెడ్డిలో గాలినాణ్యత విలువ 108గా ఉంది. ఇప్పటికైనా మనం మారాల్సిన అవసరముంది. ఏమంటారు!
Similar News
News March 13, 2025
మహబూబాబాద్: ఆవు ఢీకొని వ్యక్తి మృతి

మహబూబాబాద్ మున్సిపాలిటీ పరిధిలోని సాలార్ తండా వద్ద బుధవారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. మహబూబాబాద్ నుంచి బైక్‌పై వెళ్తున్న సంపత్ అనే వ్యక్తిని రోడ్డుపై ఆవు ఢీకొనడంతో అతను అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు కురవి మండలం సుధనపల్లి గ్రామానికి చెందిన వ్యక్తిగా స్థానికులు గుర్తించారు.
News March 13, 2025
సంగారెడ్డి: నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు: కలెక్టర్

మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ వల్లూరు క్రాంతి హెచ్చరించారు. సంగారెడ్డిలో బుధవారం ఆమె మాట్లాడుతూ.. మున్సిపాలిటీలో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆస్తి పన్ను వసూలు చేయాలని చెప్పారు. ఎల్ఆర్ఎస్‌పై కూడా ప్రజలకు అవగాహన కల్పించి రెగ్యులర్ చేసుకునేలా చూడాలని పేర్కొన్నారు.
News March 13, 2025
UPDATE: ACB సోదాల్లో లెక్క చూపని నగదు స్వాధీనం

NZB రవాణా శాఖ కార్యాలయంలో భారీగా వసూళ్లు జరుగుతున్న వైనాన్ని ఏసీబీ అధికారులు గుర్తించారు. బుధవారం సుదీర్ఘంగా జరిపిన సోదాల్లో ఏజెంట్ ఖలీల్ నుంచి రూ.27వేల లెక్కచూపని నగదు స్వాధీనం చేసుకున్నారు. అలాగే అతడి నుంచి 14 వాహనాలకు సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ పత్రాలను, ముగ్గురు వ్యక్తుల డ్రైవింగ్ లైసెన్స్లను జప్తు చేశారు. ఎవరెవరు వసూళ్లకు పాల్పడుతున్నారనే విషయమై విచారణ చేస్తున్నట్లు అధికారులు వివరించారు.