News April 4, 2024
సంగారెడ్డి: మరో కార్మికుడి మృతదేహం లభ్యం

ఎస్‌బీ ఆర్గానిక్ పరిశ్రమలో బుధవారం జరిగిన ప్రమాదంలో ఐదుగురు మృతి చెందిన విషయం తెలిసిందే. గురువారం ఓ కార్మికుడి మృతదేహం ఘటన స్థలంలో లభ్యమైంది. మృతుడు కొన్యాలకి చెందిన వడ్డే రమేశ్‌గా పోలీసులు గుర్తించారు. చికిత్స పొందుతున్న కార్మికులను మాజీ మంత్రి హరీష్‌రావు, మెదక్ ఎంపీ అభ్యర్థి వెంకటరామిరెడ్డి, నర్సాపూర్ ఎమ్మెల్యే సునీత లక్ష్మారెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్లతో కలిసి పరామర్శించారు.
Similar News
News February 12, 2026
మెదక్: ఓటు వేసేందుకు రాష్ట్రం దాటాడు

ఓటుపై తనకున్న బాధ్యతను చాటుకున్నాడో యువకుడు. మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో మెదక్ పట్టణంలోని 22వ వార్డుకు చెందిన రవితేజ(26) ఏపీలోని తెనాలి నుంచి వచ్చి తన ఓటు హక్కును వినియోగించుకున్నాడు. అక్కడ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తున్న రవితేజ, తన విలువైన ఓటును వేసేందుకు రాష్ట్రం దాటి సొంతూరికి చేరుకున్నాడు. ఈ యువకుడి చొరవను పలువురు అభినందించారు.
News February 12, 2026
మెదక్: ఓటు వేసిన 99 ఏళ్లు వృద్ధుడు

మెదక్ మున్సిపల్ ఎన్నికల్లో పట్టణానికి చెందిన 99 ఏళ్ల మర్తి కిష్టయ్య తన ఓటు హక్కును వినియోగించుకొని అందరికీ ఆదర్శంగా నిలిచారు. ప్రభుత్వం సెలవు ప్రకటించినా చాలామంది ఓటు వేయకుండా కాలక్షేపం చేస్తున్న తరుణంలో, ఈ వయసులో కూడా ఆయన పోలింగ్ కేంద్రానికి వచ్చి ఓటు వేశారు. ప్రతి ఒక్కరూ బాధ్యతగా ఓటు హక్కును వినియోగించుకోవాలని గుర్తు చేశారు. కిష్టయ్య సంకల్పాన్ని చూసి స్థానికులు, అధికారులు అభినందించారు.
News February 12, 2026
మెదక్: నేడు సీఎం కప్ జిల్లా స్థాయి పోటీలు

ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్న సీఎం కప్ క్రీడా పోటీలలో భాగంగా గురువారం కబడ్డీ, వాలీబాల్, ఖోఖో పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా యువజన క్రీడాధికారి రమేశ్ తెలిపారు. నియోజకవర్గ స్థాయిలో విజయం సాధించి, పేర్లు నమోదు చేసుకున్న క్రీడాకారులు నిర్ణీత సమయానికి హాజరు కావాలని సూచించారు. ప్రతిభ గల క్రీడాకారులను ప్రోత్సహించేందుకు ఈ పోటీలు నిర్వహిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు.


