News March 5, 2025
సంగారెడ్డి: మహిళతో శారీరకంగా కలిసి.. చివరికి

హత్య కేసును గుమ్మడిదల పోలీసులు చేధించారు. మెదక్ జిల్లా నర్సాపూర్ మండలం బిక్య తండాకు చెందిన నిందితుడు 2024 DECలో కౌడిపల్లి మండలం కన్నారం శేరి తండాకు చెందిన కేతవత్ మునీని మాయమాటలు చెప్పి గుమ్మడిదల కల్లు షాప్ నుంచి ఆమెను నల్లవల్లి అడవిలోకి తీసుకెళ్లాడు. శారీరకంగా కలసి, చున్నీతో ఆమె గొంతుకు చుట్టి ఉపిరాడకుండా చేసి చంపేశాడు. నేరస్థుడిని CC కెమెరాల ద్వారా గుర్తించి గుమ్మడిదల పోలీసులు పట్టుకున్నారు.
Similar News
News March 25, 2025
BIG BREAKING: ఫలితాలు విడుదల

దేశవ్యాప్తంగా నవోదయ విద్యాలయాల్లో ఆరో తరగతిలో ప్రవేశాల కోసం నిర్వహించిన పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. అభ్యర్థులు రోల్ నంబర్, బర్త్ డే వివరాలను ఎంటర్ చేసి రిజల్ట్స్ చెక్ చేసుకోవచ్చు.
వెబ్సైట్: <
News March 25, 2025
అల్యూమినియం పాత్రలు వాడుతున్నారా?

అల్యూమినియం పాత్రలను వాడటం ప్రమాదకరమని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ‘అల్యూమినియం ఆహారం, నీటిలో సహజంగా ఉంటుంది. దీనిని అధికంగా తీసుకోవడం వల్ల న్యూరో టాక్సిక్ ప్రభావాలను కలిగించవచ్చు. కొన్నిసార్లు ఇది క్యాన్సర్కు దారితీస్తుంది. అధిక వేడి వద్ద ఇది ఆహారంలో కలవొచ్చు. ఈ అధిక అల్యూమినియం ఎముకలు, లివర్, కిడ్నీలను ప్రభావితం చేయొచ్చు. అందుకే స్టీల్, కాస్ట్ ఐరన్ పాత్రలను వాడితే బెటర్’ అని తెలిపారు.
News March 25, 2025
Stock Markets: ఎగిసి ‘పడ్డ’ నిఫ్టీ, సెన్సెక్స్

ఉదయం భారీగా లాభపడ్డ బెంచ్మార్క్ సూచీలు చివరికి ఫ్లాటుగా ముగిశాయి. సెన్సెక్స్ 78,017 (32), నిఫ్టీ 23,668 (10) వద్ద స్థిరపడ్డాయి. సూచీలు రెసిస్టెన్సీ వద్దకు చేరడం, ట్రంప్ టారిఫ్స్ ప్రకటనే ఇందుకు కారణాలు. ఐటీ షేర్లు ఎగిశాయి. వినియోగం, PSU బ్యాంకు, మీడియా, రియాల్టి, మెటల్, ఎనర్జీ, చమురు, PSE, ఫార్మా, ఆటో, కమోడిటీస్ షేర్లు ఎరుపెక్కాయి. అల్ట్రాటెక్, ట్రెంట్, బజాజ్ ఫిన్సర్వ్, గ్రాసిమ్ టాప్ గెయినర్స్.