News March 26, 2025

సంగారెడ్డి: మహిళపై అత్యాచారం

image

సంగారెడ్డి జిల్లాలో ఓ మహిళ(30)పై <<15883977>>అత్యాచారం<<>> జరిగిన విషయం తెలిసిందే. పటాన్ చెరు(M) కంజర్లకు చెందిన దంపతులు సదాశివపేటకు వెళ్లి ఆటోలో ఇంటికి వస్తున్నారు. ఈ క్రమంలో మామిడిపల్లి చౌరస్తా వద్ద ఆటో ఆపి భర్త మూత్ర విసర్జనకు వెళ్లాడు. ఈ క్రమంలో ఇద్దరు వ్యక్తులు మహిళపై అత్యాచారానికి పాల్పడినట్లు సమాచారం. అడ్డొచ్చిన భర్తపై దాడి చేసినట్లు తెలిసింది. బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది.

Similar News

News December 9, 2025

ఫ్యూచర్ సిటీతో 13 లక్షల ఉద్యోగాలు: శ్రీధర్ బాబు

image

TG: దేశీయ, విదేశీ పెట్టుబడులను ఆకర్షించేలా ప్రపంచస్థాయి నగరంగా ‘భారత్ ఫ్యూచర్ సిటీ’ని అభివృద్ధి చేయనున్నామని మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. ‘13,500 ఎకరాల్లో జీరో కార్బన్ సిటీగా దీన్ని రూపొందిస్తాం. ఇక్కడి సంస్థల ద్వారా 13L మందికి ఉద్యోగాలు వస్తాయి. 9 లక్షల జనాభాకు వీలుగా గృహ నిర్మాణం జరుగుతుంది. డేటా సెంటర్లకు 400 ఎకరాలిస్తాం’ అని వివరించారు. అద్భుత ఆర్కిటెక్చర్ అర్బన్ ఫారెస్టులు ఉంటాయన్నారు.

News December 9, 2025

నెల్లూరు: బలమైన కారణాలు కావాలా.. విలువలకు లేదా..!

image

నెల్లూరు జిల్లా అంటే లక్షలాదిమందికి ఎమోషన్. కానీ ఇది అవసరం లేదంట. బలమైన కారణం కావాలంట. కలువాయ, రాపూరు, సైదాపురం మండలాలను తిరుపతిలో కలిపే ఆలోచనలో వ్యతిరేకత మొదలైంది. ఈక్రమంలో వచ్చే అభ్యంతరాల్లో కండలేరు రిజర్వాయర్, జిల్లాకేంద్రంతో దూరం, చారిత్రక ఆధారాలు వంటి వాటితో పాటు బలమైన అంశాలు తెలియజేయాలని, అప్పుడే రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లందుకు ప్రాధాన్యం ఉంటుందనే వాదన అధికారుల నుంచి వినిపిస్తోంది.

News December 9, 2025

కోడి పిల్లలను వదిలాక షెడ్‌లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు

image

కోళ్ల షెడ్‌లో ప్రతి 50 కోడి పిల్లలకు ఒక మేత తొట్టి, నీటి తొట్టి అమర్చాలి. తొలి వారంలో 50 పిల్లలకు 24 అంగుళాల మేత తొట్టి సరిపోతుంది. ప్రతి బ్రూడరు కింద 3-4 నీటి తొట్లను అమర్చాలి. వాటిని రోజూ శుభ్రపరచి నీటితో నింపాలి. కోడి పిల్లలను ఉంచిన షెడ్‌లో రాత్రంతా లైట్లను ఆన్‌లో ఉంచాలి. కోడి పిల్లలకు తొలి 7-10 రోజుల మధ్య ముక్కును కత్తిరిస్తే అవి ఒకదానినొకటి పొడుచుకోవడం, తొట్లలో మేతను కిందకు తోయడం తగ్గుతుంది.