News April 13, 2025
సంగారెడ్డి: మహిళపై అత్యాచారం

ఫోన్‌లో పరిచయమైన ఓ వ్యక్తి మహిళను అత్యాచారం చేసిన ఘటన వట్ పల్లిలో శనివారం జరిగింది. ఎస్ఐ విఠల్ వివరాలు.. మండలంలోని పల్వట్లకు చెందిన ఓ వివాహిత(35)తో ఫోన్‌లో పరిచయం పెంచుకున్న వ్యక్తి జోగిపేటకు వచ్చిన ఆమెను అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ సమీపంలోని పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మహిళ మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News December 18, 2025
మెదక్: ఎన్నికల్లో రూ. 1,01,32,000 స్వాధీనం

మెదక్ జిల్లాలో మూడు విడతల ఎన్నికల చేపట్టిన తనిఖీలలో రూ. 1,01,32,000 విలువైన నగదు, లిక్కర్, పిడిఎస్ బియ్యం పట్టుకున్నట్లు జిల్లా ఎస్పీ డివి శ్రీనివాసరావు తెలిపారు. రూ. 47.48 లక్షల నగదు, 268 కేసుల్లో రూ. 26,46,968 విలువైన 3688 లీటర్ల మద్యం, రూ. 27.36 లక్షల విలువైన 673 క్వింటాళ్ల పిడిఎస్ బియ్యము స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు.
News December 18, 2025
నర్సాపూర్: మూడో విడతలో అత్యధిక ఓటింగ్

మెదక్ జిల్లాలో మూడో విడత గ్రామపంచాయతీ ఎన్నికలు 7 మండలాల్లో నిర్వహించారు. 7 మండలాల్లో నిర్వహించిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో నర్సాపూర్ మండలంలో అత్యధికంగా 93.38 శాతం ఓటింగ్ జరిగినట్లు అధికార ప్రకటించారు. మండలంలో 26,927 మంది ఓటర్లు ఉండగా, 12,260 మంది పురుషులు, 12,883 మంది మహిళలు, ఇతరులు ఒక్కరుగా.. 25,144 మంది తమ ఓటు హక్కును వినియోగించుకున్నట్లు వివరించారు.