News April 13, 2025
సంగారెడ్డి: మహిళపై అత్యాచారం

ఫోన్లో పరిచయమైన ఓ వ్యక్తి మహిళను అత్యాచారం చేసిన ఘటన వట్ పల్లిలో శనివారం జరిగింది. ఎస్ఐ విఠల్ వివరాలు.. మండలంలోని పల్వట్లకు చెందిన ఓ వివాహిత(35)తో ఫోన్లో పరిచయం పెంచుకున్న వ్యక్తి జోగిపేటకు వచ్చిన ఆమెను అల్లాదుర్గం మండలం బహిరన్ దిబ్బ సమీపంలో పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేశాడు. అనంతరం మహిళ మెడలో ఉన్న రెండు తులాల పుస్తెల తాడు, ఫోన్ తీసుకుని పరారయ్యాడు. బాధిత మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.
Similar News
News November 25, 2025
బల్మెర్ లారీలో ఉద్యోగాలు

<
News November 25, 2025
ప్రకాశంలోకి అద్దంకి, కందుకూరు.. కారణం ఇదే!

ప్రకాశం జిల్లా నుంచి సరికొత్త జిల్లాగా మార్కాపురం ఏర్పడనున్న నేపథ్యంలో మరో కీలక నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. 2022లో జరిగిన జిల్లాల పునర్విభజనలో ప్రకాశం నుంచి అద్దంకి బాపట్లలోకి, కందుకూరు నెల్లూరులోకి వెళ్లాయి. అద్దంకి నుంచి బాపట్లకు 80 కి. మీ ఉండగా ఒంగోలుకు 40 కి.మీ మాత్రమే. కందుకూరుకు ఇదే సుదూర సమస్య. తాజాగా వీటిని ప్రకాశంలోకి కలిపేందుకు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై మీ కామెంట్!
News November 25, 2025
KMR: ఎన్నికల్లో మహిళలే కీలకం

కామారెడ్డి జిల్లాలో 25 మండలాల పరిధిలో సర్పంచ్, వార్డు సభ్యుల రిజర్వేషన్లు ఖరారు అయ్యాయి. దీంతో స్థానిక సంస్థల ఎన్నికల సందడి మొదలైంది. మొత్తం 6,39,730 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఓటర్లలో 3,07,508 మంది పురుషులు కాగా, 3,32,209 మంది మహిళలు ఉన్నారు. మరో 13 మంది ఇతరులు ఉన్నారు. ఈ లెక్కన పురుషుల కంటే మహిళా ఓటర్లే అధికంగా ఉన్నారు. దీంతో ఈ ఎన్నికల్లో మహిళా ఓటర్లు అత్యంత కీలక పాత్ర పోషించనున్నారు.


