News March 12, 2025

సంగారెడ్డి: మహిళా డ్రైవర్లకు లైసెన్సులు ఇప్పించాలి: కలెక్టర్

image

డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు లైసెన్సులు ఇప్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్ల కొనుగోలుకు రుణాలు ఇప్పించాలని పేర్కొన్నారు. చేసిన కార్లను కార్పొరేట్ కంపెనీలో ఏర్పాటు చేసిన చూడాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 7, 2025

నంద్యాల జిల్లాలో చికెన్ ధరలు

image

నంద్యాల జిల్లాలో ఇవాళ కేజీ చికెన్ ధర రూ.220 నుంచి రూ.250 వరకు పలికింది. మహానంది మండలంలో స్కిన్‌తో కలిపి చికెన్ కేజీ రూ.220 ఉండగా, స్కిన్‌లెస్ రూ.220 నుంచి 230వరకు విక్రయిస్తున్నారు. గత వారంతో పోలిస్తే నేడు రూ.10-30 పెరిగింది. గాజులపల్లెలో స్కిన్ రూ.220, స్కిన్‌లెస్ చికెన్ రూ.230కు విక్రయిస్తున్నారు. మటన్ కేజీ రూ.800 నుంచి రూ.850 పలుకుతోంది. ప్రాంతాన్ని బట్టి స్వల్పంగా మార్పులు ఉన్నాయి.

News December 7, 2025

WGL: పంచాయతీ ఎన్నికల సమాచారం లోపం.. మీడియాకు ఇబ్బందులు!

image

జిల్లాలో GP ఎన్నికల వివరాలు పత్రికలు, మీడియాకు చేరవేయడంలో యంత్రాంగం ఘోరంగా విఫలమైందని విమర్శలు వినిపిస్తున్నాయి. చివరి రోజు భారీగా నామినేషన్లు దాఖలైనా, అర్ధరాత్రి వివరాలు ఇస్తామని DPO చెప్పగా, సమాచార శాఖ పాత డేటానే పంపడంతో తాజా సమాచారం మాయం అయింది. గతంలో 50 మండలాల డేటాను సమయానికి అందించిన యంత్రాంగం, ఇప్పుడు 11 మండలాల వివరాలకే తంటాలు పడుతోంది. వాట్సాప్‌కే పరిమితమైన సమాచార పంపిణీతో ఇబ్బందవుతోంది.

News December 7, 2025

ముంబై-గన్నవరం సర్వీస్ ఇండిగో విమానం రద్దు

image

ముంబై నుంచి గన్నవరం అంతర్జాతీయ విమానాశ్రయానికి ఆదివారం సాయంత్రం 5:55 గంటలకు చేరుకోవాల్సి ఉన్న ఇండిగో విమాన సేవ 6E 6456ను పలు కారణాల వల్ల రద్దు చేసినట్లు విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. ప్రయాణీకులకు ముందస్తుగా సమాచారమిచ్చి ప్రత్యామ్నాయ ఏర్పాట్లను సూచించామని చెప్పారు. ఈ రద్దుతో కొంతమంది ప్రయాణీకులు అసౌకర్యానికి గురయ్యారు.