News March 12, 2025
సంగారెడ్డి: మహిళా డ్రైవర్లకు లైసెన్సులు ఇప్పించాలి: కలెక్టర్

డ్రైవింగ్ శిక్షణ పొందిన మహిళలకు లైసెన్సులు ఇప్పించాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. సంగారెడ్డి క్యాంప్ కార్యాలయంలో అధికారులతో మంగళవారం సమావేశం నిర్వహించారు. ఎస్సీ కార్పొరేషన్ ద్వారా కార్ల కొనుగోలుకు రుణాలు ఇప్పించాలని పేర్కొన్నారు. చేసిన కార్లను కార్పొరేట్ కంపెనీలో ఏర్పాటు చేసిన చూడాలని చెప్పారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News March 9, 2026
విశాఖ భీమిలి బీచ్ రోడ్‌లో విరాగో రిసార్ట్ సీజ్..!

భీమిలి బీచ్ రోడ్డులో విరాగో రిసార్ట్‌ను సోమవారం అధికారులు సీజ్ చేశారు. కోస్టల్ రెగ్యులేషన్ జోన్ నిబంధనలను ఉల్లంఘించి నిర్మాణాలు చేపట్టడంపై హైకోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు జీవీఎంసీ కమిషనర్ ఉత్తర్వులతో అధికారులు రిసార్ట్‌ను స్వాధీనం చేసుకున్నారు. నిబంధనల ఉల్లంఘనపై కఠిన చర్యలు తీసుకోవాలని న్యాయస్థానం స్పష్టం చేయడంతో ఈ చర్యలు చేపట్టినట్లు అధికారులు వెల్లడించారు.
News March 9, 2026
ఆ తేదీల్లో రికమండేషన్ లెటర్లు అంగీకరించం: TTD

AP: తిరుమల ఆలయంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం, ఉగాది ఆస్థానం సందర్భంగా ఈ నెల 17, 19 తేదీల్లో వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేస్తున్నట్లు TTD తెలిపింది. ఈ క్రమంలో 16, 18 తేదీల్లో ఎంపీ, ఎమ్మెల్యేల రికమండేషన్ లెటర్లు అంగీకరించబోమని పేర్కొంది. అయితే వీఐపీ ప్రొటోకాల్ దర్శనాలు యథావిధిగా కొనసాగుతాయని చెప్పింది.
News March 9, 2026
ChatGPTని అడిగి అమ్మాయిల సూసైడ్?.. మస్క్ రియాక్షన్ ఇదే

సూరత్(గుజరాత్)లో షాకింగ్ ఘటన జరిగింది. ‘ఎలా చనిపోవాలి? ఏ మందులు వాడాలి?’ అని ChatGPTలో అడిగి ఇద్దరు అమ్మాయిలు(18, 20ఏళ్లు) సూసైడ్ చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ విషయాన్ని ఓ వ్యక్తి Xలో పోస్టు చేయగా ఎలాన్ మస్క్ yikes(ప్రమాదకరం, షాకింగ్) అంటూ రిప్లై ఇచ్చారు. అయితే ChatGPT, Gemini Ai సూసైడ్ ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వట్లేదని పలువురు గుర్తుచేస్తున్నారు.


