News February 22, 2025
సంగారెడ్డి: మహిళా సంఘాలకు మార్చిలో ఎన్నికలు !

మహిళా సంఘాలకు మార్చిలో ఎన్నికలు జరగనున్నాయి. ఈ మేరకు సంగారెడ్డి జిల్లా గ్రామీణాభివృద్ధి శాఖ చర్యలు చేపట్టింది. MLC ఎన్నికల కోడ్ ముగిసిన వెంటనే ప్రక్రియను మరింత వేగవంతం చేయనున్నారు. మార్చి నెలాఖరులోగా ఎన్నిక ప్రక్రియను పూర్తి చేయాలని నిర్ణయించారు. జిల్లాలో మొత్తం 18,756 మహిళాసంఘాలు ఉండగా.. 1,90,381 మంది సభ్యులు ఉన్నారు. నిర్దేశించిన గడువులోగా ఎన్నికల ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు తెలిపారు.
Similar News
News December 13, 2025
చలికాలం.. కోళ్ల దాణా నిల్వలో జాగ్రత్తలు

కోళ్లకు మంచి దాణా అందించినప్పుడే వాటి పెరుగుదల బాగుంటుంది. అయితే దాణా నిల్వలోనూ తగిన జాగ్రత్తలు తీసుకోవాలని వెటర్నరీ అధికారులు సూచిస్తున్నారు. దాణా బస్తాలను నేలపై కాకుండా చెక్క పలకల మీద ఉంచాలి. గోడలకు తగలకుండా చూడాలి. తేమగా ఉన్న దాణాను నిల్వ చేయకూడదు. 2-3వారాలకు మించి దాణా నిల్వ ఉంచకూడదు. వేడి దాణా చల్లబడిన తర్వాత మాత్రమే గోదాముల్లో నిల్వ ఉంచాలి. లేదంటే బస్తాలపై తేమ ఏర్పడి బూజు పడుతుంది.
News December 13, 2025
హైదరాబాద్‌లో మెస్సీ షెడ్యూల్ ఇలా..

* రాత్రి.7.30 గంటలకు ఉప్పల్ స్టేడియానికి మెస్సీ, రాహుల్ గాంధీ, CM రేవంత్
* 7.55 గంటలకు మ్యాచ్ కిక్ ఆఫ్
* 8.06 గంటలకు గ్రౌండ్‌లోకి మెస్సీ, రేవంత్
* 8.33 గంటలకు పెనాల్టీ షూటౌట్
* 8.53 గంటలకు మెస్సీ చేతులమీదుగా విజేతకు ‘GOAT’ కప్ ప్రదానం
* 8.54 గంటలకు మెస్సీని సత్కరించనున్న సీఎం
* 8.57 గంటలకు కార్యక్రమం ముగింపు
News December 13, 2025
మద్ది ఆలయ కమిటీకి దరఖాస్తుల ఆహ్వానం

జిల్లాలో ప్రముఖ క్షేత్రమైన జంగారెడ్డిగూడెం మండలం గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ కమిటీ సభ్యుల నియామకానికి ప్రభుత్వం దరఖాస్తులు ఆహ్వానించింది. ఈ మేరకు ఎక్స్ అఫీషియో కార్యదర్శి హరి జవహర్‌లాల్ ఈ నెల 12న జీవో 1568 జారీ చేశారు. ఆసక్తిగల అభ్యర్థులు 20 రోజుల్లోగా తమ దరఖాస్తులను ఆలయ సహాయ కమిషనర్, ఈవో ఆర్‌వీ చందనకు అందజేయాలని ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.


