News March 20, 2025

సంగారెడ్డి: ముగిసిన ఇంటర్మీడియట్ పరీక్షలు

image

జిల్లాలో ఈనెల 5న ప్రారంభమైన ఇంటర్మీడియట్ పరీక్షలు గురువారంతో ముగిశాయి. ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ, కామర్స్ సబ్జెక్టులకు 15,412 మందికి 15,030 మంది విద్యార్థులు హాజరయ్యారు. 97.52 శాతం విద్యార్థులు పరీక్షకు హాజరైనట్లు జిల్లా ఇంటర్మీడియట్ అధికారి గోవిందారం తెలిపారు. ఇంటర్ పరీక్షలు ప్రశాంతంగా ముగిసినట్లు పేర్కొన్నారు.

Similar News

News December 16, 2025

కామారెడ్డి జిల్లాలో మూడో విడత పోలింగ్ రేపే!

image

కామారెడ్డి జిల్లాలో మూడో విడత జీపీ ఎన్నికల పోలింగ్‌కు రంగం సిద్ధమైంది. 168 జీపీలు ఉండగా 26 GPలు ఏకగ్రీవమయ్యాయి. మిగిలిన జీపీలకు గాను 462 సర్పంచ్ అభ్యర్థులు పోటీలో ఉన్నారు. 1,482 వార్డుల్లో పోలింగ్ జరగాల్సి ఉండగా, 449 వార్డులు ఏకగ్రీవం అయ్యాయి. 2,790 మంది వార్డు సభ్యులు ఎన్నికల బరిలో నిలిచారు. ఎన్నికల కోసం అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని కోరుతున్నారు.

News December 16, 2025

అవెంజర్స్, సూపర్ మ్యాన్ కల్పితాలు.. మనవి సత్యాలు: బోయపాటి

image

అఖండకు అవెంజర్స్‌లా స్కోప్ ఉందని డైరెక్టర్ బోయపాటి శ్రీను అన్నారు. ‘నిజానికి అవెంజర్స్, సూపర్ మ్యాన్, బ్యాట్ మ్యాన్ అన్నీ కల్పితాలు. కానీ మనకున్న పాత్రలన్నీ సత్యాలు. కురుక్షేత్రంలో అన్ని ఆయుధాలు వాడినట్లు రేడియేషన్ కనిపిస్తుంటుంది’ అని మీడియా సమావేశంలో అన్నారు. పూర్తి లాజిక్‌తోనే మూవీని తీశామని, అష్టసిద్ధి సాధన చేసిన తర్వాత పాత్రకు అసాధారణ శక్తులు రావడం సహజమని చెప్పారు.

News December 16, 2025

కరీంనగర్: నిరుద్యోగులకు అవకాశం.. 19న జాబ్ మేళా

image

కరీంనగర్ జిల్లాలోని నిరుద్యోగుల కోసం ఈ నెల 19న జిల్లా ఉపాధి కార్యాలయంలో జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు ఉపాధి అధికారి తిరుపతి రావు తెలిపారు. ఆటోమోటివ్స్ KNR సంస్థలోని 20 పోస్టులకు గాను, ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన 20-40 ఏళ్ల పురుషులు అర్హులు. వేతనం రూ.14,000 నుంచి ప్రారంభమవుతుందని, ఆసక్తి గలవారు పేరు నమోదు చేసుకోవాలని ఆయన సూచించారు. వివరాలకు 72076 59969 నంబర్లను సంప్రదించవచ్చు.