News February 2, 2025

సంగారెడ్డి: ముగిసిన బడి బయట పిల్లల సర్వే

image

సంగారెడ్డి జిల్లాలో జనవరి 11 నుంచి సీఆర్పీలు, ఐఈఆర్పీలు నిర్వహించిన బడి బయట పిల్లల సర్వే శనివారంతో ముగిసిందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. బడి బయట పిల్లల సర్వేలో గుర్తించిన పిల్లల వివరాలను ప్రభంధ పోర్టల్ వెబ్సైట్‌లో నమోదు చేయాలని సీఆర్పీలకు, ఐఈఆర్పీలకు సూచించారు.

Similar News

News October 15, 2025

రామాయంపేట: పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్య

image

పురుగుల మందు తాగి ఒక వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న ఘటన రామాయంపేటలో చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాలు.. గొలిపర్తి గ్రామానికి చెందిన ఎర్రం బాలకృష్ణ(40) కేసీఆర్ కాలనీలో నివాసం ఉంటారు. మంగళవారం రాత్రి గ్రామ శివారులో పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని విచారణ చేపట్టారు.

News October 15, 2025

రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి.. ఇద్దరికి గాయాలు

image

పాలకొల్లు-దిగమర్రు రహదారిపై బైకును ఆయిల్ ట్యాంకర్ ఢీ కొట్టిన ఘటనలో మంగళవారం ఒకరు మృతి చెందగా, ఇరువురు గాయపడ్డారు. క్షతగాత్రులు శరణ్ శర్మ, సాయి చరణ్‌ను కాకినాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వీరు పేరుపాలెం వెళ్తున్నట్లు సమాచారం. యువకులు తణుకుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. ఈ ప్రమాదంలో కొల్లి మహేష్ రాజు(18) మృతి చెందాడు.

News October 15, 2025

పిల్లల రక్షణ, విద్యకు పక్కా ప్రణాళిక: కలెక్టర్ హరిచందన

image

పిల్లల రక్షణ, నాణ్యమైన విద్యాబోధన కోసం క్యాలెండర్ ప్రకారం ప్రణాళికలు సిద్ధం చేసి, పక్కాగా అమలు చేయాలని అనుబంధ శాఖల అధికారులను HYD కలెక్టర్ హరిచందన ఆదేశించారు. కలెక్టరేట్ సమావేశ మందిరంలో జరిగిన ‘క్లాప్'(సిటీ లెవల్ యాక్షన్ ప్లాన్) అవగాహన సదస్సులో ఆమె పాల్గొన్నారు. పిల్లల రక్షణ, నాణ్యమైన విద్య, స్వచ్ఛమైన ఆహారం అందించుటలో ఈ ప్రణాళికలు కీలకం కావాలని ఆమె సూచించారు.