News March 29, 2025
సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. UPDATE

అమీన్పూర్లో <<15910567>>ముగ్గురు పిల్లలు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.
Similar News
News April 3, 2025
చేగుంట: చిన్న శివనూర్‌లో యువకుడి ఆత్మహత్య

చేగుంట మండలం చిన్న శివనూర్‌కి చెందిన మెదక్ సంతోష్ గౌడ్ (25) నిన్న రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఉరివేసుకున్నట్లు గ్రామస్థులు తెలిపారు. విషయం తెలుసుకున్న చుట్టుపక్కల వారు సంతోష్‌ను నార్సింగి ఆస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. తల్లిదండ్రులు ఓ శుభకార్యం కోసం మరో ఊరికి వెళ్లగా సంతోష్ ఈ దుర్ఘటనకు పాల్పడ్డాడు.
News April 3, 2025
వేసవి సెలవులు.. మీ పిల్లలు జాగ్రత్త: మెదక్ ఎస్పీ

మైనర్లకు సరదా కోసం బైకులు ఇస్తే మీ జీవితంలో కొత్త సమస్యలు కొని తెచ్చుకున్నట్లేనని మెదక్ ఎస్పీ డి.ఉదయ్ కుమార్ రెడ్డి హెచ్చరించారు. పిల్లల ఈత సరదా తల్లిదండ్రులకు తీరని దుఃఖాన్ని మిగిలించవద్దని అన్నారు. వేసవి సెలవులు వస్తున్నాయని, మీ పిల్లలు బావులు, చెరువుల, వాగుల్లో ఈతకు వెళ్లే క్రమంలో తల్లిదండ్రులు జాగ్రత్తగా ఉండాలన్నారు. లేదంటే ఈత సరదా ప్రమాదంగా మారే అవకాశం ఉందని హెచ్చరించారు.
News April 3, 2025
నర్సాపూర్: కుళ్లిన కోడిగుడ్లు సరఫరా చేసిన అంగన్వాడీ సిబ్బంది

నాణ్యమైన పౌష్టికాహారం అందించడమే లక్ష్యంతో అంగన్వాడీ కేంద్రాల ద్వారా గుడ్లు, పాలు లబ్ధిదారులకు అందజేస్తున్నారు. మండలంలోని కాగజ్ మద్దూర్ అంగన్వాడీ కేంద్రంలో కుళ్లినగుడ్లను పంపిణీ చేయడంతో లబ్ధిదారులు అసహనం వ్యక్తం చేశారు. కుళ్లినగుడ్ల పంపిణీ పై ప్రశ్నిస్తే తమపై దురుసుగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదే విషయమై ఉన్నతాధికారిణిని వివరణ కోరగా విచారణ చేపడతామని తెలిపారు.