News March 29, 2025

సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. UPDATE

image

అమీన్‌పూర్‌లో <<15910567>>ముగ్గురు పిల్లలు<<>> మృతిచెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్‌ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. గురువారం రాత్రి ఇంట్లో వారంతా భోజనం చేశారు. అయితే రజిత, పిల్లలు పెరుగు, పప్పుతో తినగా చెన్నయ్య మాత్రం పప్పుతో మాత్రమే తిన్నాడు. శుక్రవారం తెల్లవారుజామున చూడగా పిల్లలు చనిపోయారు. రజితకు సీరియస్‌గా ఉందని ఆస్పత్రికి తరలించారు.

Similar News

News April 20, 2025

అవార్డు అందుకొనున్న ADB కలెక్టర్

image

ఆదిలాబాద్ జిల్లా కలెక్టర్ రాజర్షి షా ఈ నెల 21న ప్రధాని మోదీ చేతులమీదుగా అవార్డు అందుకొనున్నారు. నార్నూర్‌లోని బ్లాక్ ‘ఆస్పిరేషనల్ బ్లాక్స్ ప్రోగ్రామ్’ విభాగంలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌లో శ్రేష్ఠతకు గాను ప్రధానమంత్రి అవార్డుకు ఎంపికైంది. ఈ నేపథ్యంలో సోమవారం న్యూఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో జరిగే సివిల్ సర్వీసెస్‌డే రోజున ఆయన ఈ అవార్డు అందుకొనున్నారు.

News April 20, 2025

ఇద్దరు ఉపాధ్యాయులు సస్పెండ్: డీఈఓ

image

నల్లచెరువు అంబేడ్కర్ ఎయిడెడ్ పాఠశాలలో అవకతవకలకు పాల్పడిన ఇద్దరు సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులను డీఈఓ సీవీ రేణుక సస్పెండ్ చేశారు. హాజరు తప్పుగా చూపడం, మధ్యాహ్న భోజన లబ్దిదారుల సంఖ్యను పెంచడం, రికార్డుల నిర్వహణలో నిర్లక్ష్యం వంటి ఆరోపణలపై జాకీర్ హుస్సేన్, డి. రవిపై చర్యలు తీసుకున్నారు. డీఈఓ తనిఖీలో 46 మందికి హాజరు వేసినా, కేవలం 9 మంది విద్యార్థులే ఉండటం గమనార్హం.

News April 20, 2025

ప్రకాశం: భార్యను హతమార్చిన భర్త

image

ఉమ్మడి ప్రకాశం జిల్లా యద్దనపూడి మండలం యనమదల గ్రామంలో ఆదివారం విషాదం చోటుచేసుకుంది. భార్య నీలం మంగమ్మ (45)ను భర్త నీలం శ్రీనివాసరావు హతమార్చాడు. కుటుంబ కలహాల నేపథ్యంలో హత్య జరిగినట్లు ప్రాథమిక సమాచారం. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

error: Content is protected !!