News March 29, 2025
సంగారెడ్డి: ముగ్గురు పిల్లలు మృతి.. భర్త అనుమానమే కారణమా?

SRD జిల్లా అమీన్పూర్లో ముగ్గురు పిల్లలు మృతి చెందిన విషయం తెలిసిందే. RR జిల్లా తలకొండపల్లి(M)కి చెందిన చెన్నయ్య 2012లో NLG జిల్లా మందాపూర్ వాసి రజితను రెండో పెళ్లి చేసుకున్నాడు. కొద్ది రోజుల క్రితం ఆమెపై అనుమానంతో చెన్నయ్య వేధించేవాడు. దీంతో పట్టింటికి వెళ్లింది. పెద్దలు చెప్పడంతో భర్త దగ్గరికి వచ్చింది. మళ్లీ వేధిస్తే పిల్లలతో ఆత్మహత్య చేసుకుంటానని అప్పట్లోనే రజిత హెచ్చరించినట్లు తెలిసింది.
Similar News
News November 12, 2025
SRCL: డంపింగ్ యార్డ్‌ను పరిశీలించిన ఇన్చార్జి కలెక్టర్

సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని రగుడు వద్ద ఉన్న డంపింగ్ యార్డ్‌ను ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ సందర్శించారు. తడి, పొడి చెత్త వేరు చేసే విధానం, ఆవరణ పరిసరాలు పరిశీలించారు. నిర్వహణ సక్రమంగా చేపట్టాలని అన్నారు. కంపోస్ట్ షెడ్‌ను పరిశీలించి కంపోస్ట్ తయారీ వివరాలను ఆరా తీశారు. డంపింగ్ యార్డుకు కావాల్సిన యంత్రాలు, పరికరాలకు ప్రతిపాదనలు పంపాలని ఆదేశించారు.
News November 12, 2025
సిరిసిల్ల: ‘రైతు బజార్లోనే విక్రయాలు జరగాలి’

సిరిసిల్ల పట్టణంలోని రైతు బజార్లో చికెన్, మటన్, చేపలు, కూరగాయల విక్రయాలు పూర్తి స్థాయిలో జరిగేలా ఏర్పాట్లు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. రైతుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన కూరగాయల షెడ్‌ను బుధవారం పరిశీలించారు. స్లాటర్ హౌస్ నిర్మించి, చికెన్, మటన్, చేపలు విక్రయాల పూర్తి స్థాయిలో చేసేలా ఏర్పాట్లు చేయాలని సూచించారు. పరిశీలనలో సిరిసిల్ల మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ స్వరూపారెడ్డి, పాల్గొన్నారు.
News November 12, 2025
SRCL: ‘కొత్తచెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలి’

సిరిసిల్ల పట్టణంలోని కొత్త చెరువు ఆవరణ శుభ్రంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ గరిమ అగ్రవాల్ ఆదేశించారు. సిరిసిల్ల మున్సిపల్ పరిధిలోని కొత్త చెరువును ఇన్చార్జి కలెక్టర్ బుధవారం పరిశీలించారు. చెరువు కట్టపైకి వెళ్లి, పరిసరాలు సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు. చెరువు పరిసరాలు మొత్తం శుభ్రం చేయాలని, చెత్తాచెదారం, చెట్లు తొలగించాలని సూచించారు.


