News January 27, 2025

సంగారెడ్డి: మున్సిపాలిటీలకు ప్రత్యేక అధికారుల నియామకం

image

జిల్లాలోని ఏడు మున్సిపాలిటీల పాలకవర్గం గడువు ఆదివారం ముగియడంతో ప్రత్యేక అధికారులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. సంగారెడ్డి, సదాశివపేట, నారాయణఖేడ్, ఆందోలు- జోగిపేటకు అదనపు కలెక్టర్ చంద్రశేఖర్, అమీన్పూర్, తెల్లాపూర్, బొల్లారంలకు మున్సిపల్ అడ్మినిస్ట్రేటివ్ జాయింట్ డైరెక్టర్ పాల్గుణ కుమార్‌ను ప్రత్యేక అధికారులుగా నియమిస్తూ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

Similar News

News February 8, 2025

17 సీట్లలో BJP, AAP మధ్య తేడా 1000 ఓట్లే

image

ఢిల్లీ ఎన్నికల్లో విజేతను నిర్ణయించడంలో 17 నియోజకవర్గాలు కీలకంగా మారనున్నాయి. ఎందుకంటే ఇక్కడ రెండు పార్టీల మధ్య మార్జిన్ 1000 మాత్రమే ఉంది. BJP 12, AAP 5 సీట్లలో 1000 ఓట్ల తేడాతో ముందుకు సాగుతున్నాయి. ఏ ఒక్క రౌండులోనైనా ఏదో ఒక పార్టీకి గుంపగుత్తగా ఓట్లు పడినట్లు తేలితే ఆధిక్యాలు మారడం ఖాయమే. అరవింద్ కేజ్రీవాల్, ఆతిశీ మార్లేనా 1000 ఓట్ల తేడాతోనే ఉన్నారు.

News February 8, 2025

EC డేటా: BJP 40, AAP 30

image

ఎన్నికల సంఘం వెబ్‌సైట్ ప్రకారం ఢిల్లీ ఫలితాల్లో బీజేపీ దూకుడు ప్రదర్శిస్తోంది. మొత్తం 40 స్థానాల్లో ఆధిక్యంలో ఉంది. మెజారిటీ మార్క్ 36 కన్నా ఇది 7 స్థానాలు ఎక్కువ. ఆమ్‌ఆదీ పార్టీ 30 సీట్లతో ముందుకు సాగుతోంది. బీజేపీ ఓట్ షేరు 48.03 శాతంగా ఉంది. ఆప్ 42.58 శాతం సాధించింది. కాంగ్రెస్‌కు 6.74% ఓట్‌షేర్ రావడం గమనార్హం.

News February 8, 2025

Delhi Results: ఇండీ కూటమిపై ఒమర్ అబ్దుల్లా విమర్శలు

image

ఢిల్లీ ఎన్నికల్లో కాంగ్రెస్, ఆప్ పార్టీలు ఘోర ఓటమి దిశగా ప్రయాణిస్తున్న నేపథ్యంలో జమ్మూకశ్మీర్ సీఎం ఒమర్ అబ్దుల్లా ఇండీ కూటమిపై విమర్శలు గుప్పించారు. రామాయణం సీరియల్‌కు సంబంధించిన జిఫ్‌ను షేర్ చేశారు. ‘జీవితమంతా కొట్టుకుంటూ ఉండండి. ఒకరినొకరు అంతం చేసుకోండి’ అని అందులో ఉంది. ఇండియా కూటమి పార్టీలు కొట్లాడుకుంటుంటే ఫలితాలు ఇలాగే ఉంటాయంటూ పరోక్షంగా విమర్శించారు.

error: Content is protected !!