News March 12, 2025
సంగారెడ్డి: మున్సిపాలిటీలో 76 LRSల పరిష్కారం: కలెక్టర్

మున్సిపాలిటీలో 76, పంచాయితీలో 116 ఎల్ఆర్ఎస్‌లు పరిష్కరించినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి తెలిపారు. కలెక్టరేట్ నుంచి మున్సిపల్ కమిషనర్లు, పంచాయతీ అధికారులతో మంగళవారం టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ.. ఈనెల 31లోపు పూర్తి చేసుకుంటే 25% రిపేర్ వస్తుందని చెప్పారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
Similar News
News February 13, 2026
ఎద్దు తన్నునని గుర్రంచాటున దాగినట్లు

ఎవరైనా ఎద్దు పొడుస్తుందని లేదా తన్నుతుందని భయపడి, దాని నుంచి రక్షణ కోసం వెళ్లి గుర్రం వెనుక దాకుంటే అది మరింత ప్రమాదకరం. ఎందుకంటే ఎద్దు కంటే గుర్రం మరింత వేగంగా, బలంగా తన్నుతుంది. అంటే ఎవరైనా వ్యక్తి ఒక చిన్న కష్టం నుంచి బయటపడాలని చూస్తూ, తనకు తెలియకుండానే అంతకంటే భయంకరమైన చిక్కుల్లో పడినప్పుడు ఈ సామెతను ఉపయోగిస్తారు.
News February 13, 2026
శివ నామాలు అర్థాలు ‘‘విశ్వేశ్వర’’

విశ్వం అంటే అనంతమైన బ్రహ్మాండం. ఈశ్వర అంటే పాలకుడు. ఈ సృష్టిలోని ప్రతి అణువుకూ, ప్రతి జీవికీ శివుడే ఆధారం. కాలాతీతుడైన ఆయన సమస్త లోకాలను శాసిస్తాడు. కాశీలో ఆయన ‘విశ్వేశ్వరుడు’గా కొలువై భక్తులకు జ్ఞానాన్ని, మోక్షాన్ని ప్రసాదిస్తున్నాడు. కాశీలో మరణించే ప్రతి జీవి చెవిలో ఆయన తారక మంత్రాన్ని ఉచ్ఛరించి ముక్తిని ఇస్తాడని పురాణాలు చెబుతున్నాయి. ఈ విశ్వమంతా నిండి ఉన్న పరమాత్మ కాబట్టి ఆయన ‘విశ్వేశ్వరుడు’.
News February 13, 2026
అనంతపురం జిల్లాలో పదోన్నతులు

ఉమ్మడి అనంతపురం జిల్లాలో డీపీవో, డీఎల్పీవో కార్యాలయాల యూనిట్ నుంచి ఇద్దరు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లుగా ప్రమోషన్లు వచ్చాయి. పంచాయతీ కార్యదర్శి గ్రేడ్-4 నుంచి గ్రేడ్-3 పంచాయతీ కార్యదర్శులుగా ఐదుగురికి కలెక్టర్ ఆనంద్ పదోన్నతి కల్పించినట్లు DPO నాగరాజు నాయుడు తెలిపారు. పదోన్నతి పొందిన ఐదుగురు ఉద్యోగులకు త్వరలోనే పంచాయతీలు కేటాయిస్తామన్నారు.


