News December 27, 2024
సంగారెడ్డి: మైనర్‌పై అత్యాచారం.. 20ఏళ్లు జైలు
మైనర్‌పై అత్యాచారం కేసులో నిందితుడు రజినీకాంత్‌కు 20 ఏళ్ల జైలు, రూ.10వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు జడ్జి జయంతి తీర్పు వెల్లడించారని సంగారెడ్డి ఎస్పీ రూపేశ్ తెలిపారు. 2019లో చౌటకూరు మండలం ఉప్పరగూడెంకు చెందిన రజినీకాంత్ ఇంటికి వెళ్లి అత్యాచారం చేశాడని బాలిక తండ్రి పుల్కల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసులో నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఈ మేరకు తీర్పు ఇచ్చినట్లు ఎస్పీ తెలిపారు.
Similar News
News January 15, 2025
GET READY.. 18న నవోదయ ప్రవేశ పరీక్ష
నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశాలకు NVS ఈనెల 18న ఎంట్రన్స్ టెస్టు నిర్వహిస్తుంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 27 కేంద్రాలు ఏర్పాటు చేశామని వర్గల్ నవోదయ ప్రిన్సిపల్ తెలిపారు. వెబ్‌సైట్ www.Navodaya.gov.in నుంచి విద్యార్థులు హాల్ టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. విద్యార్థి పుట్టిన తేదీ లేదా రిజిస్ట్రేషన్ నంబర్ ద్వారా హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని చెప్పారు.
News January 15, 2025
మెదక్: చాముండేశ్వరి దేవిని దర్శించుకున్న ఎస్పీ
మెదక్ జిల్లా చిలిపిచేడ్ మండలంలోని చిట్కుల్ మంజీరా నది తీరాన వెలసిన శ్రీ చాముండేశ్వరి దేవి ఆలయాన్ని జిల్లా ఎస్పీ ఉదయ్ కుమార్ రెడ్డి మంగళవారం సతీసమేతంగా సందర్శించారు. మకర సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకొని అమ్మవారికి ఎస్పీ కుటుంబ సమేతంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. వీరికి ఆలయ పూజారులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వీరితోపాటు చిలిపిచేడ్ మండల ఎస్ఐ నర్సింలు, సిబ్బంది పాల్గొన్నారు.
News January 14, 2025
మెదక్: జిల్లా ప్రజలకు సంక్రాంతి శుభాకాంక్షలు మంత్రి
జిల్లా ప్రజలకు మంత్రి దామోదర రాజనర్సింహ సంక్రాంతి పండుగ శుభాకాంక్షలు చెప్పారు. రైతు రుణమాఫీ, సకాలంలో ధాన్యం కొనుగోలు, సన్నాలకు రూ.500 బోనస్ తదితర కార్యక్రమాల్లో ప్రజల్లో హర్షం వ్యక్తం చేసినట్లు తెలిపారు. ఈ ఏడాది నుంచి రైతులు, వ్యవసాయ కూలీలకు అమలు చేయనున్న రైతు భరోసా, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా పథకాలు, పేద ప్రజలకు ఉద్దేశించి రేషన్ కార్డుల జారీ చేయనున్నామని అన్నారు.