News January 30, 2025
సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం PSలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కడారి తరుణ్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డికి చెందిన తరుణ్ బొల్లారంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పొక్సో, అట్రాసిటీ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.
Similar News
News November 8, 2025
MBNR: ఈనెల 10, 11న ఖో-ఖో ఎంపికలు

మహబూబ్‌నగర్ జిల్లా స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (SGF) ఆధ్వర్యంలో అండర్-14, అండర్-17 బాల, బాలికల ఖో-ఖో జట్ల ఎంపికలను డీఎస్ఏ స్టేడియంలో నిర్వహిస్తున్నట్లు కార్యదర్శి డాక్టర్ ఆర్. శారదాబాయి తెలిపారు. ఈ నెల 10న అండర్-14, 11న అండర్-17 ఎంపికలు జరుగుతాయన్నారు. ఆసక్తిగల క్రీడాకారులు బోనఫైడ్, ఆధార్ జిరాక్స్‌లతో ఉదయం 9 గంటలలోపు పీడీ మొగులాల్ (99859 05158)ను సంప్రదించాలని సూచించారు.
News November 8, 2025
వరంగల్: సోషల్ మీడియాలో వేధింపులపై మౌనం వద్దు!

సోషల్ మీడియాలో వేధింపులపై మౌనం వీడాలని, ఎవరైనా బెదిరిస్తే భయపడొద్దని వరంగల్ సైబర్ పోలీసులు సూచించారు. ధైర్యంగా ముందుకు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేయాలన్నారు. తెలియని వ్యక్తులతో జాగ్రత్తగా ఉండాలని, అపరిచిత వ్యక్తులతో మాటలు కలిపే ముందు ఆలోచించాలన్నారు. ఎవరినీ నమ్మవద్దని, వ్యక్తిగత సమాచారం, ఫొటోలను, వీడియోలను పంచుకోవద్దని హెచ్చరించారు.
News November 8, 2025
గర్భిణులు-తీసుకోవాల్సిన వ్యాక్సిన్లు

మహిళలు ప్రెగ్నెన్సీ ముందు, తర్వాత కొన్నిటీకాలు తీసుకోవాలి. వీటివల్ల తల్లీబిడ్డకు ఇన్ఫెక్షన్ల నుంచి రక్షణ లభిస్తుంది. ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేసుకున్నప్పుడే మీజిల్స్, మంప్స్, రుబెల్లా, చికెన్ పాక్స్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. తర్వాత HPV, DPT, హెపటైటిస్ బి, కోవిడ్, రెస్పిరేటరీ సిన్సీపియల్ వైరల్ వ్యాక్సిన్లు తీసుకోవాలి. కొందరి ఆరోగ్య పరిస్థితుల దృష్ట్యా డాక్టర్లు మరికొన్ని వ్యాక్సిన్లు సూచిస్తారు.


