News January 30, 2025

సంగారెడ్డి: మైనర్ బాలికపై అత్యాచారం.. యువకుడి అరెస్ట్

image

సంగారెడ్డి జిల్లా ఐడిఏ బొల్లారం PSలో మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కడారి తరుణ్(20)ను పోలీసులు అరెస్టు చేశారు. కామారెడ్డికి చెందిన తరుణ్ బొల్లారంలో ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తున్నాడు. కొంత కాలంగా బాలికకు మాయమాటలు చెప్పి అత్యాచారానికి పాల్పడ్డాడని బాలిక కుటుంబీకులు ఫిర్యాదు చేశారు. దీంతో యువకుడిపై పొక్సో, అట్రాసిటీ నమోదు చేసి రిమాండ్‌కు తరలించినట్లు డీఎస్పీ రవీందర్ రెడ్డి తెలిపారు.

Similar News

News February 9, 2026

కృష్ణా: ‘వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలి’

image

జిల్లాలో వెట్టి చాకిరి చట్టాన్ని కఠినంగా అమలు చేయాలని జాయింట్ కలెక్టర్ ఎం నవీన్ అధికారులను ఆదేశించారు. వెట్టి చాకిరి నిర్మూలన దినోత్సవం సందర్భంగా జిల్లా కార్మిక శాఖ ప్రత్యేకంగా ముద్రించిన గోడ పత్రికలను సోమవారం ఆయన కలెక్టరేట్‌లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో కార్మిక శాఖాధికారులు, తదితరులు పాల్గొన్నారు.

News February 9, 2026

MTM: బాల్య వివాహా ముక్తి రధాన్ని ప్రారంభించిన కలెక్టర్

image

జిల్లాలో బాల్య వివాహాలు నిరోధించడానికి ప్రతి ఒక్కరూ బాధ్యతగా తీసుకొని తమ వంతు సహకారం అందించాలని కలెక్టర్ డీకే బాలాజీ ప్రజలకు పిలుపునిచ్చారు. బాల్య వివాహ ముక్త్ భారత్ 100 రోజుల అవగాహన కార్యక్రమంలో భాగంగా ICDS ఆధ్వర్యంలో కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన బాల్య వివాహా ముక్తి రధాన్ని కలెక్టర్ ప్రారంభించారు. ఈ కార్యక్రమం ICDS PD రాణి, DCPO కిషోర్, తదితరులు పాల్గొన్నారు.

News February 9, 2026

మంచిర్యాల: ఈ నెల 20లోగా పత్తి విక్రయించాలి

image

జిల్లాలోని రైతులు ఈ నెల 20వ తేదీలోగా తమ వద్ద ఉన్న పత్తిని విక్రయించాలని జిల్లా మార్కెటింగ్ అధికారి ఎండి షాహాబుద్దీన్ తెలిపారు. రైతు సంక్షేమంలో భాగంగా ప్రభుత్వం సీసీఐ ఆధ్వర్యంలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి 2025-26 పత్తి సీజన్‌కు సంబంధించి కనీస మద్దతు ధర చెల్లించి పత్తి కొనుగోలు చేస్తామన్నారు. రైతులు సమీపంలోని సీసీఐ కొనుగోలు కేంద్రాలలో పత్తి విక్రయించాలని సూచించారు.