News February 21, 2025
సంగారెడ్డి: మైనర్ బాలికపై లైంగిక దాడి

మైనర్ బాలికపై ఇద్దరు లైంగిక దాడికి పాల్పడిన ఘటన సంగారెడ్డి మండలం ఫసల్వాది పరిధిలోని రెండు పడక గదుల ఇళ్ల సమీపంలో గురువారం రాత్రి చోటుచేసుకుంది. ఇంటి ముందు ఆడుకుంటున్న ఎనిమిది సంవత్సరాల పాపను ఇద్దరు పక్కనే ఉన్న ముళ్లపొదల్లోకి తీసుకెళ్లారు. బాలికపై లైంగిక దాడికి పాల్పడడంతో తీవ్ర రక్తస్రావమైంది. వారిలో ఒకరిని స్థానికులు పట్టుకొని చితకబాదారు. పోలీసులు కేసు నమోదు చేసుకున్నారు.
Similar News
News December 12, 2025
నగరంలో TTD క్యాలెండర్లు, డైరీల విక్రయం

కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వేంకటేశ్వర స్వామి చిత్రాలతో అందంగా రూపొందించిన క్యాలెండర్లు, డైరీలు ఇపుడు హైదరాబాద్‌లో అందుబాటులో ఉన్నాయి. హిమాయత్‌నగర్, జూబ్లీహిల్స్‌లోని టీటీడీ ఆలయాల్లో వీటితో పాటు శ్రీవారి లడ్డూలు అందుబాటులో ఉన్నాయని TTD అధికారులు తెలిపారు. క్యాలెండర్లు రూ.130, రూ.75, డైరీలు రూ.150, రూ.120కు విక్రయిస్తున్నారు. భక్తులు ఈ అవకాశం వినియోగించుకోవాలని కోరారు.
News December 12, 2025
నెల్లూరు మేయర్‌పై అవిశ్వాసం.. క్యాంప్ రాజకీయాలు షురూ

AP: నెల్లూరు మేయర్ స్రవంతిపై అవిశ్వాస తీర్మానం ఈ నెల 18న ప్రవేశపెట్టనుండటంతో క్యాంపు రాజకీయాలు మొదలయ్యాయి. కార్పొరేటర్లను గోవాకు తరలించేందుకు TDP ప్లాన్ చేస్తోందని YCP ఆరోపిస్తోంది. గత ఎన్నికల్లో మొత్తం 54 కార్పొరేటర్ స్థానాల్లో YCP గెలవగా తర్వాత మెజార్టీ సభ్యులు TDPలో చేరారు. తాజాగా ఐదుగురు తిరిగి YCP గూటికి చేరడంతో ఆ పార్టీ బలం 16కు చేరినట్లు తెలుస్తోంది. దీంతో టీడీపీ అప్రమత్తమైంది.
News December 12, 2025
సిద్దిపేట: రెండవ విడతలో 4409 మంది సిబ్బంది నియామకం

జీపీ ఎన్నికల ప్రక్రియలో భాగంగా శుక్రవారం కలెక్టరేట్లో రెండవ విడత గ్రామపంచాయతీ ఎన్నికలకు సంబంధించిన పోలింగ్ అధికారుల ర్యాండమైజేషన్ ప్రక్రియను శుక్రవారం జిల్లా ఎన్నికల అధికారి కలెక్టర్ కె.హైమావతి ఆధ్వర్యంలో నిర్వహించారు. జిల్లాలోని అక్బర్పేట భూంపల్లి, బెజ్జంకి, చిన్నకోడూరు, దుబ్బాక, మీరుదొడ్డి, నంగునూరు, నారాయణపేట, సిద్దిపేట రూరల్, అర్బన్‌లో 4409 మంది సిబ్బంది పనిచేయనున్నట్లు తెలిపారు.


