News February 13, 2026

సంగారెడ్డి: మైనర్ బాలికపై రేప్.. 20 ఏళ్ల శిక్ష

image

సంగారెడ్డి జిల్లా వట్పల్లి మండలానికి చెందిన వడ్డే రాజు మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన కేసులో సంగారెడ్డి స్పెషల్ పొక్సో కోర్టు సంచలన తీర్పునిచ్చింది. నేరం నిరూపితం కావడంతో నిందితుడికి 20 ఏళ్ల కఠిన కారాగార శిక్షతో పాటు రూ.10,000 జరిమానా విధిస్తూ జడ్జి కె.జయంతి తీర్పు చెప్పారు. నిందితుడికి శిక్ష పడేలా సమర్థవంతంగా పనిచేసిన పోలీసు అధికారులను ఎస్పీ పారితోష్ పంకజ్ ప్రత్యేకంగా అభినందించారు.

Similar News

News March 13, 2026

భీమేశ్వరుడికి కానుకల వర్షం.. హుండీ ఆదాయం ఎంతంటే?

image

వేములవాడ శ్రీభీమేశ్వర స్వామి ఆలయ ఖజానాకు హుండీ ద్వారా రెండు కోట్ల పదహారు లక్షలకు పైచిలుకు ఆదాయం సమకూరింది. గత 33 రోజుల కాలంలో హుండీలలో సమర్పించిన కానుకలను గురువారం పటిష్ఠమైన బందోబస్తు మధ్య లెక్కించారు. ఈ సందర్భంగా 2,16,65,140/- నగదు, 161 గ్రాముల మిశ్రమ బంగారం, 10 కిలోల 900 గ్రాముల మిశ్రమ వెండి లభించినట్లు ఆలయ ఈవో రమాదేవి తెలిపారు.

News March 13, 2026

పాలమూరు: కుమారుడిని ఆసుపత్రికి తీసుకెళ్తుండగా.. తండ్రి మృతి

image

మక్తల్ పట్టణంలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో జీపు డ్రైవర్ చెన్నారెడ్డి మృతి చెందాడు. దండు ప్రాంతానికి చెందిన చెన్నారెడ్డి తన అనారోగ్యంతో ఉన్న కుమారుడు అభినందన్‌ను ఆసుపత్రికి తీసుకెళ్లి తిరిగి వస్తుండగా హెచ్పీ పెట్రోల్ బంక్ వద్ద హైదరాబాద్ నుంచి మంగళూరు వెళ్తున్న కర్ణాటక ఆర్టీసీ బస్సు జీపును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో చెన్నారెడ్డి అక్కడికక్కడే మృతి చెందగా, గాయపడ్డా కుమారుడిని ఆసుపత్రికి తరలించారు.

News March 13, 2026

విషాదం.. సాఫ్ట్‌వేర్ దంపతుల దుర్మరణం

image

ఆదోని నుంచి బెంగళూరుకు కారులో వెళ్తున్న దంపతులను మృత్యువు వెంటాడింది. కర్ణాటక ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో సాఫ్ట్‌వేర్ ఉద్యోగులు అనురాగ్, ఐశ్వర్య దుర్మరణం చెందారు. కర్ణాటక సరిహద్దులో జరిగిన ఈ ఘటనలో ఐశ్వర్య అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా, అనురాగ్‌ను ఆసుపత్రికి తరలిస్తుండగా కన్నుమూశారు. బెంగళూరులో సొంతిల్లు కట్టుకుని ఆనందంగా జీవిస్తున్న దంపతుల మృతితో ఆదోని తిరుమలనగర్‌లో విషాదం అలుముకుంది.