News March 6, 2025

సంగారెడ్డి: మౌలిక వసతులు కల్పించండి: కలెక్టర్

image

జిల్లాలోని మోడల్ స్కూల్‌లలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎంశ్రీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Similar News

News November 1, 2025

గుడ్‌న్యూస్.. త్వరలో ఆస్తులకు యాజమాన్య హక్కులు!

image

దేశవ్యాప్తంగా 3.46 లక్షల గ్రామాల్లోని 4.5కోట్ల ఆస్తులకు త్వరలో యాజమాన్య హక్కులు దక్కనున్నాయి. స్వామిత్వ స్కీమ్‌లో భాగంగా FY26 చివరికల్లా ప్రాపర్టీ టైటిల్స్ ఇవ్వాలని భావిస్తున్నట్లు కేంద్ర పంచాయతీరాజ్ అధికారులు తెలిపారు. APలోని 45లక్షల ఆస్తులకూ హక్కుపత్రాలు అందనున్నాయి. గ్రామాల్లో ఇళ్లు, స్థలాలకు ఆస్తి హక్కులు లేక రిజిస్ట్రేషన్ జరగడం లేదు. ప్రాపర్టీ టైటిల్‌తో క్రయవిక్రయాలకు, లోన్లకు వీలు కలగనుంది.

News November 1, 2025

JGTL: తల్లి సూసైడ్ చేసుకున్న చోటే కూతురు కూడా..!

image

8 ఏళ్ల క్రితం తల్లి చనిపోయిన చోటే <<18160636>>కూతురు ఉరేసుకొని సూసైడ్<<>> చేసుకుంది. కొండాపూర్‌‌వాసి రవికి పెగడపల్లి మండలం బతికెపల్లికి చెందిన జ్యోతితో 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరి కూతురు సహస్ర. 2017లో భర్త రవి, కుటుంబీకుల వేధింపులతో జ్యోతి ఇంట్లోని దూలానికి ఉరేసుకుని చనిపోయింది. సవిత అనే మహిళను రవి రెండోపెళ్లి చేసుకున్నాడు. ఈ క్రమంలో తండ్రి, సవతి తల్లి వేధింపులే తన మనవరాలి చావుకు కారణమని సహస్ర అమ్మమ్మంటోంది.

News November 1, 2025

HYD: నేడు సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ ఇలా..

image

బోరబండ, ఎర్రగడ్డ డివిజన్లలో నేడు రాత్రి 7 గంటల తర్వాత సీఎం రేవంత్ రెడ్డి రోడ్ షో నిర్వహించనున్నారు. బోరబండ బస్టాప్ నుంచి విజేత థియేటర్, మోతీ నగర్ ఎక్స్ రోడ్, డాన్ బాస్కో స్కూల్, జనప్రియ బ్యాక్ గ్రౌండ్ వరకు ర్యాలీ కొనసాగనుంది. బోరబండ బస్టాప్ వద్ద పబ్లిక్ మీటింగ్, జనప్రియ బ్యాక్ గేట్ శంకర్ లాల్ నగర్ వద్ద మరో బహిరంగ సభ నిర్వహించనున్నారు.