News March 6, 2025
సంగారెడ్డి: మౌలిక వసతులు కల్పించండి: కలెక్టర్

జిల్లాలోని మోడల్ స్కూల్‌లలో మౌలిక వసతులు కల్పించేందుకు అధికారులు కృషి చేయాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్ మినీ సమావేశ మందిరంలో అధికారులతో బుధవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పీఎంశ్రీ నిధులను పూర్తిస్థాయిలో వినియోగించుకోవాలని సూచించారు. సమావేశంలో ట్రైనీ కలెక్టర్ మనోజ్, డీఈఓ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.
Similar News
News March 21, 2025
డీలిమిటేషన్ సదస్సుకు హాజరుకానున్న టీపీసీసీ అధ్యక్షుడు

ఈ నెల 22న చెన్నైలో జరిగే డీలిమిటేషన్ సదస్సుకు కాంగ్రెస్ తరపున పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్ హాజరవుతున్నట్లు కాంగ్రెస్ తెలిపింది. డీఎంకే అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో దక్షిణాది రాష్ట్రాల నాయకులందరూ పాల్గొననున్నారు. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే దక్షిణాది రాష్ట్రాలకు జరిగే అన్యాయంపై ఈ సదస్సులో చర్చించనున్నారు. ఈ సమావేశానికి హాజరవుతున్నట్లు కేటీఆర్ ప్రకటించిన సంగతి తెలిసిందే.
News March 21, 2025
తానా సభలకు కేంద్రమంత్రి వర్మకు ఆహ్వానం

అమెరికాలో మిచ్ గన్‌లో జూలై 3,4,5 తేదీల్లో జరిగే తానా సభలకు కేంద్రమంత్రి వర్మను ఆహ్వానించారు. అసోసియేషన్ ఛైర్మన్ గంగాధర్ నాదెళ్ల, కార్యవర్గ సభ్యులు ఢిల్లీలో గురువారం కలిసి ఆహ్వానపత్రిక అందజేశారు. సభ్యులతో సమావేశమైన మంత్రి అసోసియేషన్ నిర్వహిస్తున్న కార్యక్రమాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. తానా కాన్ఫరెన్స్ డైరెక్టర్ సునీల్ పాంత్రా పాల్గొన్నారు.
News March 21, 2025
ఉగాది నుంచి సన్నబియ్యం: మంత్రి పొంగులేటి

ఉగాది నుంచి సన్నబియ్యం పంపిణీ చేస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈరోజు పెనుబల్లి మండలంలో ఇందిరమ్మ ఇళ్ల శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొని మంత్రి మాట్లాడుతూ.. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా ఇచ్చిన హామీలను అమలు చేసేందుకు తమ ప్రభుత్వం యత్నిస్తుందని వెల్లడించారు. ప్రజా పాలనలో అందరికీ మేలు జరుగుతుందని వివరించారు.