News March 7, 2025

సంగారెడ్డి: యువ విజ్ఞాన్ కార్యక్రమానికి దరఖాస్తుల ఆహ్వానం

image

యువ శాస్త్రవేత్తలను తయారు చేయాలని ఉద్దేశంతో ఇస్రో వారు నిర్వహిస్తున్న యువికా లో పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ నెల 23 లోగా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈఓ మాట్లాడుతూ.. ఇస్రో వారు చేపట్టిన ఈ కార్యక్రమాన్ని విద్యార్థులు సద్వినియోగం చేసుకుని విద్యార్థుల లోపల ఉన్న ప్రతిభను వెలికి తీయాలన్నారు. భావి భారత పౌరులుగా తయారు కావడానికి ఇది మంచి అవకాశం అని పేర్కొన్నారు.

Similar News

News November 28, 2025

శ్రీకాకుళం: ‘రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలి’

image

రాష్ట్రం అంతా అభివృద్ధి చెందాలని ఏపీ రాష్ట్ర శాసన సభ అంచనాల కమిటీ ఛైర్మన్ జోగేశ్వరరావు అన్నారు. శాసన సభ అంచనాల కమిటీ 2024-25 ఈ నెల 27,28 తేదీల్లో భాగంగా శ్రీకాకుళం జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శుక్రవారం శ్రీకాకుళం కలెక్టర్ మందిరంలో సమీక్ష నిర్వహించారు.కలెక్టర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ మాట్లాడుతూ..2019-20, 2020-21, 2021-22 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి అంచనాలపై కమిటీ సమీక్షిస్తుందన్నారు.

News November 28, 2025

NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం

image

NABFID నుంచి రుణం తీసుకునేందుకు ఏపీ ప్రభుత్వం ఆమోదం తెలిపింది. అమరావతి కోసం రూ.7,500 కోట్ల రుణానికి హామీ ఇస్తూ ఉత్తరుడు జారీ చేసింది. ఈ మేరకు సీఆర్డీఏ కమిషనర్ కన్నబాబు పంపిన ప్రతిపాదనను ఏపీ ప్రభుత్వం ఆమోదించి, నిధులను అమరావతి అభివృద్ధికి ఖర్చు చేయాలని నిబంధన పెట్టింది. తదుపరి చర్యలు తీసుకోవాలని సీఆర్డిఏ కమిషనర్‌కు ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది.

News November 28, 2025

అమరావతిలో 2వ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం

image

అమరావతిలో రెండోవ దశ భూ సమీకరణకు కేబినెట్ ఆమోదం తెలిపింది. మొత్తం 7 గ్రామాల పరిధిలో 16.666.5 ఎకరాల సమీకరణ చేసేలా ప్రభుత్వం చర్యలు చేపట్టనుంది. పల్నాడు (D) అమరావతి మండలంలోని వైకుంఠపురం, పెదమద్దూరు, ఎండ్రాయి, కర్లపూడి గ్రామాలు కాగా, గుంటూరు (D) తుళ్లూరు మండలంలోని వడ్డమాను, హరిశ్చంద్రపురం, పెదపరిమి గ్రామాల్లో భూ సమీకరణకు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.