News March 16, 2025
సంగారెడ్డి: యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనండి

29 ఏళ్ల లోపు ఉన్న ప్రతి యువకుడు యూత్ పార్లమెంట్ కార్యక్రమంలో పాల్గొనాలని తారా ప్రభుత్వా డిగ్రీ కళాశాల ప్రిన్సిపల్ రత్న ప్రసాద్ అన్నారు. సంగారెడ్డిలోని తార ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో శనివారం అవగాహన సదస్సు నిర్వహించారు. వికసిత్ భారత అంశంపై ఒక నిమిషం వీడియోను అప్లోడ్ చేయాలని చెప్పారు. కేంద్ర యువజన శాఖ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు.
Similar News
News March 16, 2025
ధర్పల్లి: హోన్నాజీపేట్‌లో బీర్ సీసాతో కొట్టి చంపారు..!

ధర్పల్లి మండలం హోన్నాజిపేట్ గ్రామంలో పాలెం నడిపి మల్లయ్య (55) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుడిని భార్య, కొడుకు కలిసి శనివారం రాత్రి చంపేశారని అనుమానిస్తున్నారు. మల్లయ్య తలపై కొడుకు మధు బీరు సీసాతో దాడి చేసి గొంతు నులిమి హత్య చేయగా అందుకు మల్లయ్య భార్య లక్ష్మి సహకరించినట్లు తెలిసింది. ఈ విషయం ఆదివారం ఉదయం వెలుగు చూసింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
News March 16, 2025
రాజీవ్ యువ వికాసంపై Dy.CM భట్టి సమీక్ష

ప్రజా భవన్‌లో రాజీవ్ యువ వికాసం పథకం ప్రారంభంపై అధికారులతో డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, మంత్రి పొన్నం ప్రభాకర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజీవ్ యువ వికాసం పథకం విధి విధానాలు, కావలిసిన నిధులపై చర్చించారు. ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ కార్పొరేషన్ ఛైర్మన్లు ప్రీతం, బెల్లయ్య నాయక్, ఒబేదుల్లా కొత్వాల్, తదితరులు పాల్గొన్నారు.
News March 16, 2025
భువనగిరి: నాలుగు రోజుల్లో పరీక్ష.. అంతలోనే ప్రమాదం

భువనగిరి మున్సిపాలిటీ రాయగిరిలో రోడ్డు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. తల్లీకూతుర్లు రోడ్డు దాటుతుండగా బైక్ ఢీ కొట్టడంతో తల్లి మృతిచెందగా.. కూతురుకి గాయాలయ్యాయి. బాలిక పదోతరగతి చదువుతోంది. ఇంకో నాలుగు రోజుల్లో పరీక్షలు ఉండగా బాలికకు ప్రమాదం జరిగింది. ఆమెను భువనగిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వారిది కొలనుపాక కాగా రాయగిరికి వలస వచ్చారు.