News February 24, 2025

సంగారెడ్డి: రంజాన్ మాసం కోసం అన్ని ఏర్పాట్లు చేయండి: కలెక్టర్

image

ముస్లింలు పవిత్రంగా భావించే రంజాన్ మాసంలో అన్ని ఏర్పాట్లు చేయాలని సంబంధిత అధికారులకు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టర్ కార్యాలయంలో అధికారులతో సోమవారం సమావేశం నిర్వహించారు. కలెక్టర్ మాట్లాడుతూ.. పట్టణాలు, గ్రామాల్లో శానిటేషన్ మెరుగ్గా ఉండేలా చూడాలని చెప్పారు. ఇఫ్తార్ విందులు ఏర్పాటు చేసే చోట్ల సౌకర్యాలు కల్పించాలని పేర్కొన్నారు. ఈ సమావేశంలో ఎస్పి రూపేష్, అధికారులు పాల్గొన్నారు.

Similar News

News December 4, 2025

VKB: జిల్లాలో 26 సర్పంచ్ స్థానాలు ఏకగ్రీవం

image

తాండూర్ నియోజకవర్గంలో రికార్డు స్థాయిలో 26 గ్రామ పంచాయతీలు ఏకగ్రీవంగా ఎన్నికయ్యాయి. ఇందులో కరన్ కోట్, రాంపూర్ తండా, వీరారెడ్డిపల్లి, బిజ్వార్, చిట్టి ఘనపూర్, లక్ష్మీనారాయణపూర్, గంగసాగర్, దేవులతాండ, కిష్టాపూర్, రుద్రారం, బుగ్గాపూర్ పలు గ్రామాలు ఉన్నాయి. ఏకగ్రీవమైన పంచాయతీలు ఈ నెలాఖరు వరకు అధికారికంగా ప్రకటించనున్నారు.

News December 4, 2025

పుతిన్‌కు ఆతిథ్యం ఇవ్వనున్న రాజభవనం గురించి తెలుసా?

image

రష్యా అధ్యక్షుడు పుతిన్‌కు ఢిల్లీలోని చారిత్రక ‘హైదరాబాద్ హౌస్’ ఆతిథ్యం ఇవ్వనుంది. ఒకప్పుడు ప్రపంచ ధనవంతుడిగా పేరొందిన చివరి నిజాం ఉస్మాన్ అలీ ఖాన్ ఈ రాజ భవనాన్ని కట్టించారు. సీతాకోకచిలుక ఆకారంలో నిర్మించేందుకు 2L పౌండ్లు(ఇప్పటి లెక్కల్లో ₹170 కోట్లు) ఖర్చు చేశారు. 8.6 ఎకరాల ప్యాలెస్‌లో 36 గదులు, మెట్ల మార్గాలు, ఫౌంటైన్లు వంటివెన్నో ఉన్నాయి. ఎంతో మంది దేశాధినేతలు ఇక్కడ ఆతిథ్యం స్వీకరించారు.

News December 4, 2025

గ్లోబల్ సమ్మిట్‌కు HYD వ్యాప్తంగా ఫ్రీ బస్సులు

image

తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ ఎగ్జిబిషన్‌కు ఉచిత బస్సులను ఏర్పాటు చేశారు. ఈ నెల 10 నుంచి 13 వరకు గ్లోబల్ సమ్మిట్‌కు చేరుకునేందుకు MGBS, JBS, కూకట్‌పల్లి, చార్మినార్, ఎల్బీనగర్ వంటి ప్రధాన కేంద్రాల నుంచి బస్సులు అందుబాటులో ఉండనున్నాయి. గ్లోబల్ సమ్మిట్‌కు వెళ్లేందుకు ఉ.9 నుంచి మ.1 వరకు, తిరిగి వచ్చేందుకు సా.4 నుంచి రాత్రి 9 వరకు ఇవి అందుబాటులో ఉండనున్నాయి.