News January 23, 2025
సంగారెడ్డి: ‘రిపబ్లిక్‌డే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలి’

ఈనెల 26న జిల్లా కేంద్రంలోని పోలీస్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే రిపబ్లిక్‌డే వేడుకలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ వల్లూరు క్రాంతి అధికారులను ఆదేశించారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు విద్యాసంస్థలలో రిపబ్లిక్‌డే వేడుకలు ఘనంగా నిర్వహించాలని సూచించారు.
Similar News
News September 19, 2025
ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువు పొడిగింపు: కోఆర్డినేటర్

ఓపెన్ టెన్త్, ఇంటర్ ప్రవేశాల గడువును పొడిగించినట్లు ఉమ్మడి వరంగల్ జిల్లా సార్వత్రిక విద్య కోఆర్డినేటర్ అనగాని సదానందం తెలిపారు. ఆసక్తి ఉన్న వారు ఈ నెల 24వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. ఇంటిపట్టున ఉండి చదువుకోవాలనుకునే వారికి ఇదొక చక్కటి అవకాశమని, ఆసక్తి ఉన్నవారు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
News September 19, 2025
సంగారెడ్డి: 4,096 మంది మహిళలకు వైద్య పరీక్షలు

స్వాస్త్ నారి స్వశక్తి పరివార్ కింద జిల్లాలో 4,096 మహిళలకు వైద్య పరీక్షలు నిర్వహించినట్లు జిల్లా వైద్యాధికారి డాక్టర్ నాగ నిర్మల శుక్రవారం తెలిపారు. వీరిలో బీపీ-1,853 , షుగర్-1,419, కాన్సర్-6860, మానసిక ఆరోగ్యం కౌన్సెలింగ్ 585, గర్భిణీ మహిళలకు ఏఎన్సీ పరీక్షలు 495, బాలికలు గర్భిణీల వ్యాక్సినేషన్ 120, ఎనీమియా స్క్రీనింగ్ 995, మహిళల ఆరోగ్య సంరక్షణకు కౌన్సిలింగ్ 750 పరీక్షలు నిర్వహించామన్నారు.
News September 19, 2025
MHBD: యూరియా కోసం వెళ్తే ప్రాణాలు పోతున్నాయి!

జిల్లాలో ప్రస్తుతం రైతు వేదికల వద్ద రైతుల పట్టా పాస్ బుక్ నంబర్ ఆధారంగా యూరియా పంపిణీ జరుగుతోంది. అయితే రైతు వేదిక క్లస్టర్ పరిధిలో చాలా గ్రామాలు ఉండటంతో యూరియా తీసుకునేందుకు వెళ్తున్న రైతులు ప్రమాదాలకు గురవుతున్నారు. ఇటీవల గూడూరులో ఓ రైతు ఇదే రీతిలో ప్రమాదానికి గురై మరణించాడు. యూరియా పంపిణీ రైతు వేదికల వద్ద కాకుండా గ్రామ పంచాయతీ కార్యాలయాల వద్ద చేపట్టాలని రైతులు కోరుతున్నారు.