News April 5, 2024

సంగారెడ్డి: రియాక్టర్ పేలుడుపై దర్యాప్తు ముమ్మరం: ఐజీ

image

హత్నూర మండలంలో ఎస్బీ ఆర్గానిక్స్ పరిశ్రమలో రియాక్టర్ పేలుడు ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నామని మల్టీజోన్ ఐజీ సుధీర్ బాబు అన్నారు. నేడు సంగారెడ్డిలో ఎస్పీ రూపేశ్‌తో కలిసి మీడియాతో మాట్లాడారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారిగా పటాన్‌చెరు డీఎస్పీని నియమించామని, నివేదిక వచ్చాక దాని ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. అటు పరిశ్రమలో బుధవారం జరిగిన ఘటనలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది.

Similar News

News December 27, 2025

MDK: న్యూ ఇయర్ జోష్.. ఎస్పీ కీలక సూచనలు

image

న్యూ ఇయర్ వేడుకలు ప్రజలు ప్రశాంతంగా, నిబంధనలకు లోబడి జరుపుకోవాలని ఎస్పీ డి.వి. శ్రీనివాసరావు పిలుపునిచ్చారు. డిసెంబర్ 31 రాత్రి 8 గంటల నుంచే జిల్లావ్యాప్తంగా పోలీసుల పహారా మొదలవుతుందని, పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలతో పెట్రోలింగ్ నిర్వహిస్తామన్నారు. ‘డ్రంక్ అండ్ డ్రైవ్’ తనిఖీలు ముమ్మరం చేస్తామని, వేడుకల పేరిట హద్దులు దాటొద్దన్నారు. నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు.

News December 27, 2025

మెదక్: ‘అర్హులైన అందరికీ అక్రెడిటేషన్స్ ఇవ్వాలి’

image

అర్హులైన జర్నలిస్టులకు అందరికీ అక్రెడిటేషన్స్ ఇవ్వాలని టీయూడబ్ల్యూజే (హెచ్- 143) యూనియన్ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు శనివారం జర్నలిస్టులు మెదక్ కలెక్టరేట్ ఎదుట ఆందోళన నిర్వహించారు. అనంతరం డీఆర్వో భుజంగ రావుకు వినతిపత్రం సమర్పించారు. జోవో నంబర్ 252 పూర్తిగా లోపభూయిష్టంగా ఉందని టీయూడబ్ల్యూజే (హెచ్ 143) ఉమ్మడి మెదక్ జిల్లా గౌరవ అధ్యక్షుడు జానకిరామ్ గౌడ్, జిల్లా కన్వీనర్ సురేందర్ రెడ్డి విమర్శించారు.

News December 26, 2025

MDK: సర్పంచ్ ఫోరం అధ్యక్షుడి ఎన్నికలో ట్విస్ట్‌లు!

image

చిన్నశంకరంపేటలో బుధవారం ఓ ఫంక్షన్ హల్లో సర్పంచులు మీటింగ్ ఏర్పాటు చేసి సర్పంచుల ఫోరం అధ్యక్షుడిగా కామారం తండా సర్పంచ్ మోహన్ నాయక్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు ప్రకటన విడుదల చేశారు. ఇదిలా ఉండగా గురువారం 31 గ్రామపంచాయతీలలోని 16 మంది సర్పంచులు పార్టీలకతీతంగా చిన్నశంకరంపేట సర్పంచ్ NRI కంజర్ల చంద్రశేఖర్‌ను సర్పంచ్ల ఫోరమ్ అధ్యక్షుడిగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు తెలిపారు.