News March 28, 2025
సంగారెడ్డి: రూ.25 కోట్ల సీఎస్ఆర్ నిధులతో అభివృద్ధి: కలెక్టర్

జిల్లాలో 2024-25 సంవత్సరానికి రూ.25 కోట్ల సీఎస్ఆర్ నిధులతో చేపట్టిన పనులు చేపట్టినట్లు కలెక్టర్ వల్లూరు క్రాంతి ఆదేశించారు. కలెక్టరేట్లో అధికారులతో సమావేశం నిర్వహించారు. సీఎస్ఆర్ నిధులతో అంగన్వాడి కేంద్రాలు, ప్రభుత్వ ఆసుపత్రులు, పాఠశాలలో మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు చెప్పారు. వచ్చే చేయడానికి ప్రణాళికలు తయారు చేయాలని సూచించారు. సమావేశంలో అధికారులు పాల్గొన్నారు.
Similar News
News November 23, 2025
తూ.గో: భార్యాభర్తల ఘర్షణ.. అడ్డొచ్చిన మామ మృతి

భార్యాభర్తల గొడవ ఓ నిండు ప్రాణాన్ని బలిగొంది. ఎర్రకొండలో అల్లుడి చేతిలో మామ మృతి చెందిన ఘటన విషాదాన్ని నింపింది. సీఐ టి.గణేషశ్ వివరాల ప్రకారం.. శ్రీనివాస్ తన భార్య నాగమణితో గొడవ పడుతుండగా, ఆమె తండ్రి అప్పలరాజు వారిని వారించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో శ్రీనివాస్ బలంగా తోసేయడంతో సిమెంట్ రోడ్డుపై పడి అప్పలరాజు తలకు తీవ్ర గాయమై మృతి చెందారు. నాగమణి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
News November 23, 2025
అరుణాచలం వెళ్లే భక్తులకు పాలమూరు డిపో శుభవార్త

మహబూబ్ నగర్ జిల్లా నుంచి తమిళనాడు రాష్ట్రంలోని అరుణాచల ప్రదక్షణకు వెళ్లే భక్తులకు డిపో మేనేజర్ సుజాత శుభవార్త తెలిపారు. డిసెంబర్ 3న బస్సు సాయంత్రం 7 గంటలకు బయలుదేరుతుందన్నారు. ప్యాకేజీ రూ.3600 ఉంటుందన్నారు. https://tsrtconline.in బుక్ చేసుకోవాలని తెలిపారు. 9441162588 నంబర్ను సంప్రదించాలన్నారు.
News November 23, 2025
రేపు వాయుగుండం.. 48 గంటల్లో తుఫాన్

బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మలక్కా, సౌత్ అండమాన్ మీదుగా కొనసాగుతోందని APSDMA తెలిపింది. ఇది వాయవ్యదిశగా కదులుతూ రేపటికల్లా వాయుగుండంగా మారే అవకాశం ఉందని పేర్కొంది. అదేవిధంగా కొనసాగుతూ 48 గంటల్లో తుఫాన్గా బలపడే ఛాన్స్ ఉందని హెచ్చరించింది. దీని ప్రభావంతో ఈ నెల 28 నుంచి డిసెంబర్ 1 వరకు ఏపీలో అక్కడక్కడ వర్షాలు కురిసే అవకాశం ఉందని ఇప్పటికే పేర్కొన్న సంగతి తెలిసిందే.


