News May 19, 2024
సంగారెడ్డి: రెండు చోట్ల ఓటేశారు !

నాగల్గిద్ద, కంగ్టి, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లోని సుమారు 40 గ్రామాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడ కర్ణాటక సరిహద్దు గ్రామస్థులు సైతం ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈనెల 7న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటేసి వీరు, తిరిగి తెలంగాణ MP ఎన్నికల్లోనూ ఓటేశారు. ఇలా ఆయా గ్రామాల్లో 75 శాతం పోలింగ్ నమోదైంది. నాగల్గిద్ద(M) ఏస్గి గ్రామంలో 150 మంది, గౌడ్గామ్జనవాడకు చెందిన 100 మంది 2చోట్ల ఓచేసినట్లు టాక్.
Similar News
News November 23, 2025
మెదక్: రిజర్వేషన్ కోసం ఎదురు చూపులు?

మెదక్ జిల్లా గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు మెంబర్ల రిజర్వేషన్ కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు. జిల్లాలో 492 పంచాయతీలుండగా 4,220 వార్డులు, మొత్తం ఓటర్లు 5,23,327 ఉన్నారు. ఇందులో మహిళలు 2,71,787, పురుషులు 2,51,532 ఇతరులు 8 మంది ఉన్నారు. ఇవాళ సాయంత్రం వరకు రిజర్వేషన్ ప్రక్రియ పూర్తి చేసేందుకు కలెక్టర్ ఆధ్వర్యంలో కసరత్తు నడుస్తోంది. తమకు అనుకూలంగా వస్తుందా లేదా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
News November 23, 2025
మెదక్: నేడు NMMS పరీక్ష

నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్ షిప్(NMMS) పరీక్ష ఆదివారం ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరుగుతుందని జిల్లా విద్యాధికారులు తెలిపారు. పరీక్షకు విద్యార్థులు గంట ముందే పరీక్ష కేంద్రాలకు చేరుకోవాలని సూచించారు. పరీక్షా కేంద్రాలకు ఎలాంటి ఎలక్ర్టానిక్ వస్తువులు అనుమతి లేదని, ప్రతీ పరీక్ష కేంద్రం వద్ద పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశామని వివరించారు.
News November 23, 2025
మెదక్లో JOBS.. APPLY NOW

మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమ శాఖ పరిధిలోని మెదక్ సఖి సెంటర్లో పొరుగు సులభ పద్ధతిలో దిగువ తెలిపిన ఉద్యోగాల నియామకానికి అర్హులైన మహిళ అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా అధికారి హేమ భార్గవి సూచించారు. సైకో సోషల్ కౌన్సిలర్, మల్టీ పర్పస్ స్టాఫ్/కుక్ పోస్టులకు డిసెంబర్ 10లోపు జిల్లా సంక్షేమ అధికారి, మహిళా, శిశు, దివ్యాంగుల వయోవృద్ధుల సంక్షేమ శాఖ కార్యాలయం మెదక్లో సమర్పించాలని తెలిపారు.


