News May 19, 2024

సంగారెడ్డి: రెండు చోట్ల ఓటేశారు !

image

నాగల్‌గిద్ద, కంగ్టి, న్యాల్కల్, మొగుడంపల్లి మండలాల్లోని సుమారు 40 గ్రామాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడ కర్ణాటక సరిహద్దు గ్రామస్థులు సైతం ఓటు హక్కు కలిగి ఉన్నారు. ఈనెల 7న కర్ణాటకలో జరిగిన ఎన్నికల్లో ఓటేసి వీరు, తిరిగి తెలంగాణ MP ఎన్నికల్లోనూ ఓటేశారు. ఇలా ఆయా గ్రామాల్లో 75 శాతం పోలింగ్‌ నమోదైంది. నాగల్‌గిద్ద(M) ఏస్గి గ్రామంలో 150 మంది, గౌడ్‌గామ్‌జనవాడకు చెందిన 100 మంది 2చోట్ల ఓచేసినట్లు టాక్.

Similar News

News December 4, 2024

సంగారెడ్డి, సిద్దిపేట జిల్లాలో భూకంపం !

image

ఉమ్మడి మెదక్ జిల్లాలోని పలుచోట్ల భూకంపం సంభవించింది. సంగారెడ్డి, సిద్దిపేట, హుస్నాబాద్, జగదేవ్‌పూర్, జోగిపేట, గజ్వేల్, కొమ్మేపల్లి, పొట్టపల్లి ప్రాంతాల్లో భూమి కంపించిందని పలువురు సోషల్ మీడియాలో పేర్కొనా, దీనిపై అధికారులు వివరణ ఇవ్వాల్సి ఉంది. ఉ.7:25 నుంచి 7:30ల మధ్య భూమి కంపించింది. దీంతో ఇళ్లలో ఉన్న ప్రజలు ఒక్కసారిగా బయటికి పరుగులు తీశారు. అయితే మీ ప్రాంతంలో వస్తే కామెంట్ చేయండి.

News December 4, 2024

నేడు  ఉమ్మడి జిల్లాలో NAS పరీక్ష

image

సంగారెడ్డి జిల్లాలో 101 పాఠశాలలో బుధవారం NAS పరీక్ష నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ పరీక్ష నిర్వహించడానికి 101 మంది ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లను నియమించామని, ప్రతి పాఠశాలకు ఒక అబ్జర్వర్ ఉంటారని పేర్కొన్నారు. పాఠశాల హెచ్ఎంలు పరీక్ష ప్రశాంతంగా జరిగే విధంగా చూడాలని కోరారు.

News December 4, 2024

సంగారెడ్డి: నేడు ఏకసభ్య కమిషన్ పర్యటన: కలెక్టర్

image

సంగారెడ్డిలో బుధవారం ఏక సభ్య కమిషన్ చైర్మన్ శమీమ్ అత్తర్ సభ్యులు సంగారెడ్డికి వస్తున్నారని కలెక్టర్ వల్లూరు క్రాంతి మంగళవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు ఎస్సీ కుల సంఘాల నుంచి వినతి పత్రాలను స్వీకరిస్తారని చెప్పారు. ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన దళిత సంఘాల నాయకులు తమ వినతి పత్రాలను సమర్పించాలని చెప్పారు.