News April 25, 2024
సంగారెడ్డి: రేపటి నుంచి ఓపెన్ స్కూల్ పరీక్షలు
సంగారెడ్డి జిల్లాలో 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఓపెన్ స్కూల్ టెన్త్, ఇంటర్మీడియేట్ పరీక్షలు ఈనెల 25 నుంచి మే 2 వరకు నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు పూర్తి చేయగా, జిల్లావ్యాప్తంగా 6685 మంది హాజరుకానున్నారు. టెన్త్ పరీక్ష కేంద్రాల్లో, ఇంటర్మీడియేట్ 15 కేంద్రాల్లో నిర్వహించనున్నారు. పదవ తరగతి 2388, ఇంటర్ 4297 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు.
Similar News
News January 20, 2025
మనోహరాబాద్: మృతుడిని గుర్తించేందుకు ప్రయత్నం
మనోహరాబాద్ మండలం ముప్పిరెడ్డిపల్లి శివారులోని పాత బావిలో కుళ్లిపోయిన వ్యక్తి శవం లభ్యమైంది. శవాన్ని గుర్తించేందుకు విచారణ చేస్తున్నట్లు మనోహరాబాద్ ఎస్ఐ సుభాష్ గౌడ్ తెలిపారు. ముప్పిరెడ్డిపల్లి, కొండాపూర్ రోడ్డులో పాత బావిలో శవాన్ని గుర్తించినట్లు వివరించారు. కుళ్లిపోయిన శవాన్ని గుర్తించేందుకు ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు. మృతదేహాన్ని తూప్రాన్ మార్చురీకి తరలించినట్లు పేర్కొన్నారు.
News January 20, 2025
మెదక్: పెరుగుతున్న చలి తీవ్రత
ఉమ్మడి మెదక్ జిల్లాలో రోజు రోజుకూ చలి తీవ్రత పెరుగుతోంది. దీంతో అత్యల్ప ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సోమవారం ఉదయం వరకు నమోదైన ఉష్ణోగ్రత ఇలా ఉన్నాయి. సంగారెడ్డి జిల్లా కోహిర్ 8.9, జహీరాబాద్ 9.9, న్యాల్కల్ 10.2, మెదక్ జిల్లాలోని టేక్మాల్ , నార్సింగి 12.2, రామాయంపేట 12.4, సిద్దిపేట జిల్లాలోని కొండపాక 10.9, మార్కూక్ 11.2, మిర్దొడ్డి 12.0°C ఉష్ణోగ్రతలు నమోదైనట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.
News January 20, 2025
MDK: రద్దీగా మారిన బస్టాండ్లు
సంగారెడ్డి, మెదక్, సిద్దిపేట జిల్లాల్లోని ఆర్టీసీ బస్టాండ్లు గత 3 రోజులుగా ప్రయాణికులతో సందడిగా మారాయి. సంక్రాంతి సెలవులు ముగియడంతో HYDలో చదువుతున్న విద్యార్థులు, పని నిమిత్తం ప్రజలు భారీగా తరలివెళ్లడంతో బస్టాండ్లు కిటకిటలాడుతున్నాయి. నారాయణఖేడ్, జహీరాబాద్, గజ్వేల్, మెదక్, నర్సాపూర్, సిద్దిపేట, తూప్రాన్‌లో ప్రయాణికుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశారు.