News January 26, 2025

సంగారెడ్డి: రేపటి నుంచే 10వ తరగతి ప్రాక్టీస్ పేపర్-1 పరీక్షలు

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు రేపటి నుంచి ఫిబ్రవరి 4 వరకు ప్రాక్టీస్ పేపర్-1 పరీక్షలను నిర్వహిస్తున్నట్లు జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. డీఈవో మాట్లాడుతూ.. ప్రాక్టీస్ పేపర్లకు సంబంధించిన ప్రశ్నా పత్రాలను మండల వనరుల కేంద్రాల నుంచి తీసుకోవాలని సూచించారు.

Similar News

News February 19, 2025

శ్రీలత రెడ్డి రాజకీయ ప్రస్థానం ఇదే!

image

BJP జిల్లా పార్టీ పగ్గాలు తొలిసారి మహిళ చేతిలోకి వెళ్లాయి. జిల్లా అధ్యక్షురాలిగా నేరేడుచెర్లకు చెందిన శ్రీలతరెడ్డిని అధిష్ఠానం నియమించింది. 2019లో BRSతో రాజకీయప్రస్థానం మొదలుపెట్టిన ఈమె నేరేడుచెర్ల మున్సిపల్ వైస్ ఛైర్‌పర్సన్‌గా పనిచేశారు. 2023లో MP ఈటల సమక్షంలో BJPలో చేరి HNR నుంచి పార్టీ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాగా ఆమె సోదరుడు పోరెడ్డి కిషోర్ BJPలో రాష్ట్ర అధికార ప్రతినిధిగా కొనసాగుతున్నారు.

News February 19, 2025

శ్రీశైల క్షేత్రంలో నేటి పూజ కార్యక్రమాలు ఇవే

image

శ్రీశైలం క్షేత్రంలో నేటి బుధవారం మంచి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 9 గంటలకు శ్రీస్వామివారి యాగశాలలో బ్రహ్మోత్సవ క్రతువులకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. 10 గంటల నుంచి పుణ్యాహవాచనం, అఖండదీపారాధన, వాస్తుపూజ, వాస్తుహోమం, మండపారాధన, రుద్రకలశస్థాపన, పంచావరణార్చనలు, జపానుష్ఠానాలు, రుద్రపారాయణలు, సాయంత్రం సాయంకాలార్చనలు, అగ్నిప్రతిష్ఠాపన, అంకురారోపణ, రుద్రహోమం నిర్వహిస్తారు.

News February 19, 2025

శివాజీ జయంతి: హోరెత్తనున్న వికారాబాద్

image

మరాఠా సామ్రాజ్య స్థాపకుడు ఛత్రపతి శివాజీ జయంతి నేడు. ఈ సందర్భంగా ఉత్సవాలకు వికారాబాద్ ముస్తాబైంది. తాండూరు, పరిగి, వికారాబాద్, కొడంగల్‌లో హిందూ ఏక్తా ర్యాలీలు నిర్వహించనున్నారు. శివాజీ మహారాజ్ భారీ విగ్రహాలను పట్టణాల్లో ఊరేగిస్తారు. గతంలో పూడూరు మండలంలో ఛత్రపతి విగ్రహాన్ని MLA రాజాసింగ్ ఆవిష్కరించారు. ఇక్కడా వేడుకలు ఘనంగా నిర్వహిస్తారు. జై భవాని.. జై శివాజీ నినాదాలతో నేడు వికారాబాద్ హోరెత్తనుంది.

error: Content is protected !!