News January 28, 2025

సంగారెడ్డి: రేపు టెన్త్ విద్యార్థులకు సైన్స్ ప్రతిభ పరీక్ష

image

సంగారెడ్డి జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో పదో తరగతి చదువుతున్న విద్యార్థులకు బుధవారం  పాఠశాల స్థాయిలో సైన్స్ ప్రతిభ పరీక్ష నిర్వహించాలని DEO వెంకటేశ్వర్లు చెప్పారు. ఈనెల 31న మండల స్థాయిలో, ఫిబ్రవరి 4న జిల్లా స్థాయిలో ఈ పరీక్ష నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు.

Similar News

News December 9, 2025

శ్రీకాకుళం: ఏపీ టెట్ పరీక్షకు ఏర్పాట్లు పూర్తి

image

శ్రీకాకుళం, బరంపూర్ గంజాం ఒడిశాలో జరగనున్న ఏపీ టెట్-2025 కంప్యూటర్ పరీక్షకు ఏడు పరీక్ష కేంద్రాల్లో మొత్తం పదివేల 499 మంది అభ్యర్థులు హాజరవుతారని డీఈవో రవి బాబు మంగళవారం తెలిపారు. ఈ పరీక్షను ఈ నెల 10 నుంచి 21 వరకు రెండు పూటలు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. శ్రీకాకుళం జిల్లాలో 9221 మంది అభ్యర్థులు హాజరవుతారని తెలిపారు. పరీక్షా కేంద్రాలకు MEOలను డిపార్ట్మెంటల్ అధికారులుగా నియమించారన్నారు.

News December 9, 2025

ఈ టైమ్‌లో రీల్స్ చూస్తున్నారా? వైద్యుల సలహా ఇదే!

image

ఈమధ్య చాలామంది రీల్స్ చూస్తూ విలువైన సమయాన్ని వృథా చేస్తున్నారు. అనవసర రీల్స్ చూసే సమయాన్ని వ్యాయామానికి, నిద్ర కోసం కేటాయించాలని వైద్యులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఉదయం లేవగానే ఫోన్‌లో రీల్ స్క్రోల్ చేయకుండా వ్యాయామం చేయడం ఉత్తమం అని తెలిపారు. రాత్రుళ్లు మొబైల్ నుంచి వచ్చే బ్లూలైట్ నిద్రను నియంత్రించే మెలటోనిన్‌ను అణచివేసి, నిద్ర నాణ్యతను తగ్గిస్తుందని వారు హెచ్చరించారు. share it

News December 9, 2025

పౌష్టిక ఆహారంపై యాప్ ద్వారా పర్యవేక్షణ: పీవో

image

ఉమ్మడి జిల్లాలోని ఐటీడీఏ పరిధిలో ఉన్న గిరిజన పాఠశాలలు, సంక్షేమ వసతి గృహాలలో విద్యార్థులకు అందిస్తున్న పౌష్టికాహారంపై ఐటీడీఏ పల్స్ యాప్ ద్వారా నిరంతర పర్యవేక్షణ జరుగుతోందని ఇన్‌ఛార్జ్ పీవో యువరాజ్ తెలిపారు. విద్యార్థులకు కామన్ డైట్ మెనూ సక్రమంగా అమలు చేయడాన్ని పర్యవేక్షించేందుకు ఈ యాప్ ప్రవేశపెట్టినట్లు వెల్లడించారు. ఇప్పటి వరకు యాప్‌ సమర్థంగా వినియోగిస్తూ ఫొటోలు, వివరాలు అప్లోడ్ అవుతున్నాయన్నారు.