News February 10, 2025

సంగారెడ్డి: రేపు పది విద్యార్థులకు ప్రేరణ తరగతులు

image

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు టిసాట్ ద్వారా రేపు ప్రేరణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, విషయ నిపుణుల ద్వారా పదో తరగతి విద్యార్థులకు కేరీర్ గైడెన్స్ పైన సలహాలు ఇవ్వడం జరుగుతుందని, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని పాఠశాలల హెచ్ఎంలకు డిఈవో సూచించారు.

Similar News

News September 17, 2025

అనకాపల్లి: రాగల ఐదు రోజుల్లో తేలికపాటి వర్షాలు

image

అనకాపల్లి జిల్లాలో రాబోయే ఐదు రోజులు మేఘావృత వాతావరణం నెలకొని తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని ఆర్ఆర్ఎస్ వ్యవసాయ పరిశోధనా స్థానం అధికారి ముకుందరావు తెలిపారు. మంగళవారం జరిగిన వాతావరణ ఆధారిత వ్యవసాయ అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. రైతులు తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

News September 17, 2025

విహారయాత్రకు బయలుదేరిన జీవీఎంసీ కార్పొరేటర్లు

image

జీవీఎంసీ కార్పొరేటర్లు విహారయాత్రకు బయలుదేరారు. మొత్తం 83 మంది కార్పొరేటర్లు ఉండగా.. ఇందులో 43 మంది మహిళా కార్పొరేటర్లు ఉన్నారు. మేయర్‌తో పాటు జీవీఎంసీ సెక్రెటరీ, అధికారులు బయలుదేరిన వారిలో ఉన్నారు. తొమ్మిది రోజులు జరిగే ఈ అధ్యయన యాత్రలో జైపూర్, జోద్‌పూర్, ఢిల్లీ, తదితర ప్రాంతాల్లో కార్పొరేషన్ ప్రాజెక్టులను పరిశీలిస్తారు. 24న తిరిగి విశాఖ రానున్నట్లు అధికారులు తెలిపారు.

News September 17, 2025

సోషల్ మీడియా పోస్టుకి స్పందించిన DyCM పవన్ కళ్యాణ్

image

ట్విట్టర్‌(X)లో ఒక సామాన్యుడు పెట్టిన పోస్టుకు DyCM పవన్ కళ్యాణ్ స్పందించారు. గుంతలమయంగా మారిన ఏలేశ్వరం – అడ్డతీగల రోడ్డు దుస్థితిపై చైతన్య రాజు అనే వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. పవన్ ఈ పోస్టుకు స్పందించి, తక్షణ మరమ్మతులకు ఆదేశాలు జారీ చేశారు. న్యూ డెవలప్‌మెంట్ బ్యాంక్ నిధులతో రహదారి నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు. దీంతో ప్రజలు హర్షం వ్యక్తం చేశారు.