News February 10, 2025
సంగారెడ్డి: రేపు పది విద్యార్థులకు ప్రేరణ తరగతులు

జిల్లాలోని అన్ని ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి విద్యార్థులకు టిసాట్ ద్వారా రేపు ప్రేరణ తరగతులు నిర్వహించడం జరుగుతుందని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు తెలిపారు. ఈ సమావేశంలో పాఠశాల విద్యాశాఖ సెక్రటరీ, విషయ నిపుణుల ద్వారా పదో తరగతి విద్యార్థులకు కేరీర్ గైడెన్స్ పైన సలహాలు ఇవ్వడం జరుగుతుందని, దీనికి సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయాలని పాఠశాలల హెచ్ఎంలకు డిఈవో సూచించారు.
Similar News
News July 6, 2025
పోరుమామిళ్ల: నకిలీ కానిస్టేబుల్‌పై ఫిర్యాదు

పోరుమామిళ్ల మండలం కమ్మవారిపల్లెకి చెందిన ఓ యువతి సత్యసాయి జిల్లా తుమ్మలవారిపల్లెకి చెందిన భాను ప్రకాశ్‌ను 7 నెలల క్రితం వివాహం చేసుకుంది. అతను హైదరాబాదులో AR కానిస్టేబుల్‌గా పనిచేస్తున్నట్లు నమ్మించి మోసం చేసి వివాహం చేసుకున్నాడని యువతి తెలిపింది. అంతేకాకుండా అదనపు కట్నం కోసం వేధిస్తున్నాడని శనివారం పోరుమామిళ్ల PSలో ఫిర్యాదు చేసింది.
News July 6, 2025
జులై 13 నుంచి వెబ్ ఆప్షన్లు

AP: EAPCET, ఫార్మసీ కాలేజీల వెబ్ ఆప్షన్ల నమోదును ఈ నెల 13 నుంచి నిర్వహించనున్నారు. గతంలో ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఈ నెల 10 నుంచి జరగాల్సి ఉండగా, 13వ తేదీకి మార్చారు. ఇంజినీరింగ్ కాలేజీలకు యూనివర్సిటీల అనుబంధ గుర్తింపు, ప్రభుత్వ అనుమతులు రావడానికి ఆలస్యం కారణంగానే వెబ్ ఆప్షన్ల నమోదు షెడ్యూల్‌లో అధికారులు మార్పులు చేశారు.
News July 6, 2025
విజయవాడ: రాత పరీక్ష లేకుండా 170 ఉద్యోగాల భర్తీ

విజయవాడలోని AP స్త్రీనిధి క్రెడిట్ కోఆపరేటివ్ ఫెడరేషన్ లిమిటెడ్‌లో కాంట్రాక్ట్ పద్ధతిన 170 అసిస్టెంట్ మేనేజర్ పోస్టులను భర్తీ చేయనున్నారు. డిగ్రీ పూర్తి చేసిన వారు https://www.sthreenidhi.ap.gov.in/లో ఈ నెల 7 నుంచి 18 లోపు దరఖాస్తు చేసుకోవాలని సంస్థ MD హరిప్రసాద్ తెలిపారు. ఎంపికైన వారికి నెలకు రూ.25,520 వేతనం ఇస్తామని, పూర్తి వివరాలకు పైన ఇచ్చిన వెబ్‌సైట్ చూడవచ్చన్నారు.