News March 19, 2025

సంగారెడ్డి: రేపు పోలీస్ స్టేషన్‌లకు పది ప్రశ్నాపత్రాలు

image

పదో తరగతి సెట్-2 ప్రశ్నాపత్రాలు బుధవారం పోలీస్ స్టేషన్‌లకు చేరుకుంటాయని జిల్లా విద్యాధికారి వెంకటేశ్వర్లు మంగళవారం తెలిపారు. పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంట్ అధికారులు డబుల్ లాక్డ్ ట్రంక్ బాక్స్‌లతో ఉదయం 10 గంటలకు సంబంధిత పోలీస్ స్టేషన్‌లో హాజరు కావాలని సూచించారు. ఈ విషయాన్ని గమనించాలని కోరారు.

Similar News

News November 26, 2025

హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించిన పురందీశ్వరి

image

రాజమండ్రి ఎంపీ డాక్టర్ దగ్గుబాటి పురందీశ్వరి బుధవారం రాజమండ్రి రూరల్ వేమగిరిలోని హార్టికల్చర్ పరిశోధనా కేంద్రాన్ని సందర్శించారు. అక్కడ జరుగుతున్న పరిశోధనలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి నర్సరీ రైతు ఈ పరిశోధనా కేంద్రం ద్వారా ఉపయోగం పొందాలని ఆమె అన్నారు. ప్రతి నర్సరీ రైతు విధిగా తమ పేరును హార్టికల్చర్ ఏడీ ఆఫీసులో నమోదు చేసుకోవాలని సూచించారు.

News November 26, 2025

పెద్దపల్లి: ‘బీసీ ఉద్యమాలలో మహిళలు భాగస్వామ్యం కావాలి’

image

పెద్దపల్లి ఆర్యవైశ్య భవనంలో నిర్వహించిన సెమినార్లో ‘బీసీ ఉద్యమాల్లో మహిళల పాత్ర’ అంశంపై చర్చ జరిగింది. బీసీ హక్కుల సాధనలో మహిళల భాగస్వామ్యం తప్పనిసరని నాయకులు అభిప్రాయపడ్డారు. బీసీలకు హామీ ఇచ్చిన 42% రిజర్వేషన్‌ను 22%కు తగ్గించడం అన్యాయమని, కామారెడ్డి డిక్లరేషన్ అమలయ్యే వరకు పోరాటాలు కొనసాగుతాయని ఉద్యమకారుడు శ్రీమన్నారాయణ స్పష్టం చేశారు.

News November 26, 2025

సూర్యాపేట: పంచాయతీ ఎన్నికలు.. కలెక్టర్ ఆదేశాలు

image

గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఎలాంటి పొరపాట్లకు తావివ్వకుండా, పారదర్శకంగా నిర్వహించాలని కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ ఆదేశించారు. బుధవారం సూర్యాపేటలోని కలెక్టరేట్‌లో గ్రామ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా మొదటి విడత నామినేషన్లు స్వీకరించనున్న ఆర్వోలు, ఏఆర్వోలు, ఎంపీడీవోలకు ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమంలో పాల్గొని మాట్లాడారు. మొదటి విడతలో 8 మండలాల్లో 159 జీపీ, 1,442 వార్డులకు ఎన్నికలు జరుగుతాయన్నారు.